Vijayasai Reddy : ఏపీ మద్యం కేసులో విజయసాయిరెడ్డికి మరోసారి సిట్ నోటీసులు..!
Vijayasai Reddy : ఏపీ మద్యం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు.

Vijayasai Reddy
Vijayasai Reddy : ఏపీ మద్యం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరోసారి సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12న విచారణకు హాజరుకావాలని (Vijayasai Reddy) నోటీసుల్లో పేర్కొంది. శనివారం ఉదయం 10 గంటలకు విజయవాడ సీపీ కార్యాలయం రెండో అంతస్తులోని సిట్ కార్యాలయానికి రావాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటికే రెండు పర్యాయాలు విజయసాయి రెడ్డిని సిట్ విచారించిన సంగతి తెలిసిందే. రాజ్ కెసిరెడ్డి అరెస్ట్ తర్వాత విజయసాయి రెడ్డిని ఎఫ్ఐఆర్‌లో సిట్ చేర్చింది.
మద్యం పాలసీకి సంబంధించి మొదటి సమావేశం హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలోని తన నివాసంలో, రెండో సమావేశం తాడేపల్లిలోని నివాసంలో జరిగిందని విజయసాయి రెడ్డి మీడియాకు తెలిపారు. సిట్ అధికారులకు కూడా అదే వివరించినట్లు చెప్పారు.
విజయసాయిరెడ్డిని రెండోసారి విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులివ్వడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఈ మద్యం కేసులో 11 మంది నిందితులను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక ఛార్జ్‌షీట్ కోర్టులో దాఖలు చేసేందుకు సిట్ అధికారులు రెడీ అవుతున్నారు.