Midhun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై సిట్ ప్రశ్నల వర్షం
కుంభకోణం అనేదే లేనప్పుడు అసలు ఈ ప్రశ్నలు ఎలా ఉత్పన్నం అవుతాయని ఎదురు ప్రశ్నలు వేశారు మిథున్ రెడ్డి.

Midhun Reddy: ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ సుదీర్ఘంగా ప్రశ్నించింది. 8 గంటల పాటు విచారణ సాగింది. పలు కోణాల్లో ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. న్యాయవాది సమక్షంలోనే విచారణ మొత్తం కొనసాగింది. మద్యం పాలసీ రూపకల్పన, మిథున్ రెడ్డి ప్రమేయం, డిస్టిలరీల నుంచి ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ మద్యం కొనుగోళ్లు తదితర అంశాలపై సుదీర్ఘంగా ప్రశ్నలు సంధించారు సిట్ అధికారులు.
రాజ్ కసిరెడ్డికి చెందిన ఆదాన్ డిస్టిలరీ, డీకార్ట్ నుంచి ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ ఎంత మేర మద్యం కొనుగోళ్లు జరిగాయి? డిస్టిలరీల నుంచి ఎంత ధరకు మద్యం సరఫరా చేశారు? అన్న విషయం పైనా ప్రశ్నించారు. రాజ్ కసిరెడ్డి, అతని అనుచరులు చాణక్య రాజ్, అవినాష్ రెడ్డిలతో మిథున్ రెడ్డికి ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీల గురించి సిట్ అధికారులు క్వశ్చన్ చేశారు.
Also Read: విజయనగరం పోలీస్ స్టేషన్‌లో నటి శ్రీరెడ్డి.. ఆ కేసులో విచారించిన పోలీసులు..
కొన్ని ప్రశ్నలకు అప్రస్తుతం అంటూ సమాధానాలు దాట వేశారు మిథున్ రెడ్డి. కుంభకోణం అనేదే లేనప్పుడు అసలు ఈ ప్రశ్నలు ఎలా ఉత్పన్నం అవుతాయని ఎదురు ప్రశ్నలు వేశారు మిథున్ రెడ్డి. విజయసాయిరెడ్డి ఇంట్లో మద్యం పాలసీల గురించి ఏం మాట్లాడుకున్నారని ప్రశ్నించింది సిట్. మద్యం కుంభకోణంలో మరోమారు మిథున్ రెడ్డిని ప్రశ్నించే యోచనలో సిట్ ఉన్నట్లు తెలుస్తోంది.
మిథున్ రెడ్డిపై సిట్ బృందం ప్రశ్నల వర్షం..
* రాజ్ కసిరెడ్డి, అవినాశ్ రెడ్డి, చాణక్య రాజ్ తో లిక్కర్ పాలసీపై ఎందుకు చర్చించారు
* ఆదాన్ డిస్టిలరీ, డీకార్ట్ కు 100 కోట్ల రుణం ఇప్పించడంలో పాత్రపై ఆరా
* మద్యం పాలసీపై ప్రైవేట్ వ్యక్తులతో ఎందుకు చర్చించారు
* విజయసాయిరెడ్డి ఇంట్లో రెండు దఫాలుగా ఏం చర్చించారు
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here