Sri Sathya Sai Idol In Puttaparthi : పుట్టపర్తిలో అద్భుతం.. సత్యసాయి విగ్రహం మెడలో నాగుపాము.. చూసేందుకు పోటెత్తిన స్థానికులు

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణ పరిధిలోని బ్రాహ్మణపల్లి రహదారి వద్ద గల ఆర్గ్ సంగ్ విల్లాస్ గృహ సముదాయంలో సోమవారం సత్యసాయి బాబా పాలరాతి విగ్రహానికి నాగుపాము చుట్టుకొని ఉన్న దృశ్యం కనిపించింది.

Sri Sathya Sai Idol In Puttaparthi : పుట్టపర్తిలో అద్భుతం.. సత్యసాయి విగ్రహం మెడలో నాగుపాము.. చూసేందుకు పోటెత్తిన స్థానికులు

SAI TEMPLE SNAKE

Updated On : December 13, 2023 / 12:49 PM IST

Sri Sathya Sai Idol : శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. విదేశీయురాలు ఇంటిలో సత్యసాయి బాబా పాలరాతి విగ్రహం మెడలో నాగుపాము ప్రత్యక్షమైంది. విగ్రహానికి చుట్టుకున్న నాగు పామును చూసి స్థానికులు ఆశ్చర్య పోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read : Shabarimala : కిటకిటలాడుతున్న శబరిమల.. రోజుకు లక్ష మందికిపైగా తరలివస్తున్న అయ్యప్ప భక్తులు

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణ పరిధిలోని బ్రాహ్మణపల్లి రహదారి వద్ద గల ఆర్గ్ సంగ్ విల్లాస్ గృహ సముదాయంలో సోమవారం సత్యసాయి బాబా పాలరాతి విగ్రహానికి నాగుపాము చుట్టుకొని ఉన్న దృశ్యం కనిపించింది. అమెరికాకు చెందిన ప్యాట్రీ సియా కైన్ మెన అనే భక్తురాలు మూడు నెలల క్రితం సత్య సాయిబాబా విగ్రహాలతో శ్రీ సత్యసాయి ఈశ్వర దత్త మందిరాన్ని ఇక్కడ నిర్మించారు. నిత్యం ఆమె పూజలు చేస్తూ.. నైవేద్యం అందిస్తుంది. సోమవారం మధ్యాహ్నం ఒక పెద్ద నాగుపాము తన ఇంటి ఆవరణలోని మందిరంలోకి ప్రవేశించింది. సత్యసాయి బాబా విగ్రహం మెడకు చుట్టుకుని విగ్రహాన్ని ముద్దాడుతూ కనిపించింది.

Also Read : Samantha : క్రిస్మస్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టిన సమంత.. హాలిడేస్ అంటూ..

ఈ విషయాన్ని ఆమె స్థానికులకు తెలిపింది. వారు అక్క డకు చేరుకుని నాగుపాముకు పాలు, నీళ్లు తాపిస్తూ పసుపు, కుంకుమ, పూలు చల్లుతూ పూజలు చేశారు. నాగుపాము కొన్ని గంటల పాటు విగ్రహాన్ని చుట్టుకుని పడగవిప్పి ఆరాధిస్తున్నట్లుగా అక్కడే ఉండి పోయింది. ఈ దృశ్యాన్ని చూడటానికి భక్తులు పోటెత్తారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.