Snake On Road : వీడియో.. నడిరోడ్డుపై పడగ విప్పి నాగుపాము హల్ చల్.. గ్రహణం వీడిన తర్వాత వెళ్లిపోయిన వైనం

చంద్రగ్రహణం వేళ.. ప్రకాశం జిల్లా దోర్నాల మార్కాపురం మెయిన్ రోడ్డుపై ఓ నాగుపాము హల్ చల్ చేసింది. నడిరోడ్డుపై పడగ విప్పి దర్జాగా నిల్చుండి పోయింది.

Snake On Road : వీడియో.. నడిరోడ్డుపై పడగ విప్పి నాగుపాము హల్ చల్.. గ్రహణం వీడిన తర్వాత వెళ్లిపోయిన వైనం

Updated On : November 9, 2022 / 12:01 AM IST

Snake On Road : చంద్రగ్రహణం వేళ.. ప్రకాశం జిల్లా దోర్నాల మార్కాపురం మెయిన్ రోడ్డుపై ఓ నాగుపాము హల్ చల్ చేసింది. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ..సడెన్ గా నడిరోడ్డుపై ప్రత్యక్షం అయ్యింది. అంతేకాదు.. ఆ పాము అదరలేదు, బెదరలేదు.. నడిరోడ్డుపై పడగ విప్పి దర్జాగా నిల్చుండి పోయింది. దీంతో వాహనాలన్నీ రోడ్డుపైనే ఆడిపోయాయి. రోడ్డుపై అంత మంది జనం ఉన్నా, వాహనాలు ఉన్నా.. ఆ సర్పం భయపడలేదు. అక్కడి నుంచి కదల్లేదు.

ఏదైనా వెహికల్ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తే.. దానివైపు పాము కదులుతోంది. దీంతో వాహనదారులు బెంబేలెత్తిపోయారు. పున్నమి వేళ పాముకి కళ్లు కనిపించవని నానుడి ఉంది. నిజంగానే ఆ పాముకి కళ్లు కనిపించలేదో ఏమో.. దాదాపు అరగంట పాటు రోడ్డు మీదే బుసలు కొడుతూ ఉండిపోయింది. వాహనదారులు వెళ్లకుండా అడ్డు పడింది. దీంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయ్యింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

అయితే, అనూహ్యంగా చంద్రగ్రహణం వీడిన తర్వాత.. నాగుపాము రోడ్డుపై నుంచి వెళ్లిపోవడం వాహనదారులను విస్మయానికి గురి చేసింది. నాగుపాము వెళ్లిపోవడంతో వాహనాలు ముందుకు కదిలాయి. ట్రాఫిక్ క్లియర్ అయ్యింది. చంద్రగ్రహణం వేళ నడిరోడ్డుపై పగడ విప్పి నాగుపాము బుసలు కొట్టడం చర్చకు దారితీసింది. దీనిపై ఎవరికి తోచిన విధంగా వారు తమ అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు.