Anil Kumar : చరిత్ర లేని నేతలు నాపై విమర్శలు చేస్తున్నారు : అనిల్ కుమార్

తన స్థాయి గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. తాను రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యానని, ఒకసారి మంత్రిగా ఉన్నానని.. లోకేష్ స్థాయి ఏంటని ప్రశ్నించారు.

Anil Kumar : చరిత్ర లేని నేతలు నాపై విమర్శలు చేస్తున్నారు : అనిల్ కుమార్

Anil Kumar Counter

Updated On : June 25, 2023 / 10:35 AM IST

Anil Kumar Fire TDP Leaders : యువగళం పాదయాత్ర సందర్భంగా సీఎం జగన్ పై నారా లోకేష్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చానని మాజీమంత్రి అనిల్ కుమార్ తెలిపారు. టీడీపీకి చరిత్ర ఉన్నా, చరిత్ర లేని నేతలు తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తన స్థాయి గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. ఈ మేరకు ఆదివారం అనిల్ కుమార్ నెల్లూరులో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

తాను రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యానని, ఒకసారి మంత్రిగా ఉన్నానని.. లోకేష్ స్థాయి ఏంటని ప్రశ్నించారు. ఎనీ టైమ్.. ఎనీ సెంటర్ చర్చకు సిద్ధమని చెప్పారు. అలాగే ఆనం రామనారాయణ రెడ్డిపై అనిల్ కుమార్ ఫైర్ అయ్యారు. రామనారాయణ రెడ్డి జగన్ దయ వల్ల గెలిచి.. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Hijab Controversy : హిజాబ్ ధరించి స్కూల్ కు వెళ్లిన విద్యార్థినిని ఇంటికి పంపిన యాజమాన్యంపై కేసు నమోదు

“రాజీనామా చేసి వెళ్లాలని అడిగానని అందుకు నా రాజీనామాను ఆనం అడిగారు” అని వెల్లడించారు. దమ్ముంటే నెల్లూరు సిటీలో తనతో తలపడగలవా అని ఆనంకు ఛాలెంజ్ చేశారు. తాను గనుక ఓడిపోతే.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని స్పష్టం చేశారు. టికెట్టు తెచ్చుకునే సత్తా ఆనంకు ఉందా ప్రశ్నించారు.