AndhraPradesh: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌తో సోమేశ్ కుమార్ భేటీ

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వైదొలగిన సోమేశ్‌ కుమార్‌ ఇవాళ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ను కలిశారు. సోమేశ్ కుమార్ తో పాటు ఏపీ సీఎస్ జవహర్ కూడా ఉన్నారు. సోమేశ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తారని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. ఏపీ సర్కారుకి సోమేశ్ కుమార్ ఈ విషయంపై రిపోర్టు చేసే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చాయి.

AndhraPradesh: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌తో సోమేశ్ కుమార్ భేటీ

AndhraPradesh

Updated On : January 12, 2023 / 12:26 PM IST

AndhraPradesh: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వైదొలగిన సోమేశ్‌ కుమార్‌ ఇవాళ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ను కలిశారు. సోమేశ్ కుమార్ తో పాటు ఏపీ సీఎస్ జవహర్ కూడా ఉన్నారు. సోమేశ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తారని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. ఏపీ సర్కారుకి సోమేశ్ కుమార్ ఈ విషయంపై రిపోర్టు చేసే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చాయి.

అనంతరం ఆయన వీఆర్‌ఎస్‌ తీసుకోనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముందుగా ఇవాళ జవహర్‌ రెడ్డిని కలిసిన సోమేశ్ కుమార్ అనంతరం తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. జగన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తే ఏపీ ప్రభుత్వం దాన్ని ఆమోదించే అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం జాయినింగ్‌ రిపోర్టు అందించిన తర్వాత సోమేశ్ కుమార్ వీఆర్‌ఎస్‌ తీసుకోవడానికి అవకాశం ఉంది.

సర్వీసుకి ఏపీకి వెళ్లేందుకు సోమేశ్ కుమార్ కు ఆసక్తి లేదని తెలుస్తోంది. కాగా, తెలంగాణ సీఎస్‌ గా శాంతి కుమారిని నియమిస్తూ నిన్న తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సీనియార్టీ, సర్వీసు ఆధారంగా ఆమె నియామకం జరిగింది. తెలంగాణ కేడర్‌ లో సోమేశ్‌ కుమార్ కొనసాగింపును హైకోర్టు రద్దు చేస్తూ తీర్పు వెలువరించడంతో ఆయన ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయాల్సి ఉంది. అందుకు నేడు చివరి రోజు.

Telangana politics : ఖమ్మం చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయం..రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్నీ పార్టీల గురి ఖమ్మంపైనే…