దారుణం : ఆస్తికోసం తల్లిదండ్రులపై పెట్రోలు పోసి నిప్పు 

  • Published By: veegamteam ,Published On : March 3, 2019 / 07:06 AM IST
దారుణం : ఆస్తికోసం తల్లిదండ్రులపై పెట్రోలు పోసి నిప్పు 

Updated On : March 3, 2019 / 7:06 AM IST

కణేకల్ : ఆస్తి కోసం కన్నవారినే కడతేరుస్తున్నారు కన్నబిడ్డలు. సొమ్ముల కోసం జరగుతున్న హత్యలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. ఈ  క్రమంలో అనంతపురం జిల్లాలోని కణేకల్ మండల కేంద్రంలో ఇటువంటి దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణ ఘటన జరిగింది. ఆస్తి తగాదాలతో కన్న కొడుకే ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇది గమనించిన స్థానికులు వారిని చికిత్స ఆస్పత్రికి తరలించారు. వారిని పరీక్షించిన 80 శాతం శరీరాలు కాలిపోయాయని..వైద్యులు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని..తెలిపారు. 
 

చెడు వ్యవసనాలకు బానిసైన కుమారుడు కుమారుడు మధుసూధన్ రెడ్డి ఆస్తి తన పేరున రాసివ్వాలంటు గత కొంతకాలం నుంచి తల్లిదండ్రులు తల్లి నర్సమ్మ, తండ్రి నారాయణరెడ్డిలను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో మార్చి 3వ తేదీ ఉదయం ఆస్తిని తనపేరున రాయాలని తల్లిదండ్రుల్ని మధుసూధన్ అడిగాడు. లేదంటే ఇద్దర్నీ చంపేస్తానని బెదిరించాడు. అయినా వారు ఒప్పుకోకపోవటంతో.. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ఇద్దరిపైనా పోసి నిప్పంటించేశాడు. దీంతో వారు హాహాకారాలు చేయటంతో  స్థానికులు పరుగు పరుగున వచ్చేసరికి మంటల్లో కాలిపోతున్న క్రమంలో మంటల్ని ఆర్పి వారిని ఆస్పత్రికి తరలిచించారు. ఈ క్రమంలో మధుసూధన్ పరారయ్యాడు. దీంతో వారిని ఆస్పత్రికి తలలించిన పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. కేసు నమోదుచేసుకున్నపోలీసులు మధు సూధన్ కోసం గాలిస్తున్నారు.