అల్లుడి వేధింపులు : మామ ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య

  • Published By: nagamani ,Published On : August 8, 2020 / 01:13 PM IST
అల్లుడి వేధింపులు : మామ ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య

Updated On : October 31, 2020 / 4:26 PM IST

కడప జిల్లా కమలాపురం మండలం యర్రగుడిపాడులో విషాదం చోటు చేసుకుంది. అల్లుడి వేధింపులు తట్టుకోలేక మామ బాబురెడ్డి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోతూ సెల్ఫీ వీడియో తీసి తన చావుకు కారణం తన అల్లుడు సురేష్ రెడ్డి కారణమని సెల్ఫోలో వీడియో రికార్డు చేసిన చనిపోయాడు.
తండ్రి బాబురెడ్డి చనిపోవటంతో అతని ఇద్దరు కూతుళ్లు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.



తన తండ్రి మరణానికి తన భర్తేకారణమని తెలిసి శ్వేతారెడ్డి తట్టుకోలేకపోయింది.తీవ్ర మనోవేదనకు గురైంది. దీంతో రైలు పట్టాల వద్దకు వెళ్లి రైలు కిందపడి చనిపోయింది. ఈ విషయం తెలిసిన ఇంజనీరిగ్ చదివే శ్వేత చెల్లెలు సాయి కూడా తండ్రీ..అక్కా చనిపోయారు..నేనెందుకు బ్రతికి ఉండటం అనుకుని ఆమెకూడా రైలుకింద పడి చనిపోయింది.



ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు రాణి పేట మధ్యగల రైల్వే ట్రాక్‌పైన ఇద్దరి మృతదేహాలు లభించాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముగ్గురి మృతితో ప్రొద్దుటూరులో విషాదఛాయలు అలముకున్నాయి.