విజయనగరంలో ఎగిరేది ఏ జెండా? ఎవరెవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి?
34 నియోజకవర్గాలు ఉన్న ఉత్తరాంధ్రలో గాలి ఎటు వీస్తే అధికారం ఆ పార్టీ వశమైనట్లే. ఇప్పుడు కాదు గత కొన్ని దశాబ్దాలుగా ఇదే ఒరవడి కొనసాగుతోంది.

Vizianagaram Politics
Vizianagaram Politics : ఉత్తరాంధ్ర.. రాష్ట్రంలో ఓ చివరన ఉన్న మూడు జిల్లాలు కలిసిన ప్రాంతం. సువిశాల సముద్ర తీరం. పూర్తిగా వ్యవసాయ ఆధారం. ఎంతో రాజకీయ చైతన్యం. పెద్ద పెద్ద నాయకులకు నిలయం. తరతమ బేధం లేకుండా ఎక్కడి వారినైనా ఆదరించే మనస్తత్వం అక్కడి ప్రజల సొంతం. 34 నియోజకవర్గాలు ఉన్న ఉత్తరాంధ్రలో గాలి ఎటు వీస్తే అధికారం ఆ పార్టీ వశమైనట్లే. ఇప్పుడు కాదు గత కొన్ని దశాబ్దాలుగా ఇదే ఒరవడి కొనసాగుతోంది. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా నిలిచిన ఉత్తర కోస్తాలో గత ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ గిరగిరా తిరిగింది.
అంతకుముందు అంటే 2014లో టీడీపీ, ఇంకా ముందుకెళితే వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీకి ఉత్తరాంధ్ర వెన్నుదన్నుగా నిలిచింది. రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా నిలుస్తున్న విశాఖ కేంద్రంగా ఉండే ఉత్తరాంధ్రలో ఈసారి ఏ పార్టీకి ఊపు ఉంది? మూడు జిల్లాల్లో 34 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? విజయనగరం కోటపై ఎగిరే జెండా ఏది? డిటైల్ రిపోర్టు..
Also Read : టీడీపీ-జనసేన ఎంపీ అభ్యర్థులు వీరే? వైసీపీ సిట్టింగ్ ఎంపీలకూ టికెట్లు..!
ఉత్తరాంధ్ర ఎన్నికల ఫలితాలు 1999
మొత్తం సీట్లు – 37
తెలుగుదేశం పార్టీ – 27 (శ్రీకాకుళం-10, విజయనగరం-6, విశాఖపట్నం-11)
కాంగ్రెస్ – 10 (శ్రీకాకుళం-2, విజయనగరం-6, విశాఖపట్నం-2)
ఉత్తరాంధ్ర ఎన్నికల ఫలితాలు 2004
మొత్తం సీట్లు – 37
కాంగ్రెస్ – 21 (శ్రీకాకుళం-7, విజయనగరం-6, విశాఖ-8)
తెలుగుదేశం – 12 ( శ్రీకాకుళం – 4, విజయనగరం-5, విశాఖపట్నం-3)
ఇతరులు -4 (కురుపాం-CPM, విజయనగరం-స్వతంత్ర, చింతపల్లి-సీపీఐ, పాడేరు-బీఎస్‌పీ లకే రాజారావు)
ఉత్తరాంధ్ర ఎన్నికల ఫలితాలు 2009
మొత్తం సీట్లు – 34
కాంగ్రెస్ – 23 (శ్రీకాకుళం-9, విజయనగరం-7, విశాఖపట్నం-7)
తెలుగుదేశం – 7 (శ్రీకాకుళం-1, విజయనగరం-2, విశాఖపట్నం-4)
ప్రజారాజ్యం – విశాఖపట్నం జిల్లాలో 4 సీట్లు గెలుచుకుంది
ఉత్తరాంధ్ర ఎన్నికల ఫలితాలు 2014
మొత్తం సీట్లు – 34
తెలుగుదేశం 24 ( శ్రీకాకుళం – 7, విజయనగరం – 6, విశాఖపట్నం – 11)
వైసీపీ 9 (శ్రీకాకుళం-3, విజయనగరం – 3, విశాఖపట్నం – 3)
2014 ఎన్నికల్లో బీజేపీ విశాఖ నార్త్ నుంచి గెలుపొందింది
ఉత్తరాంధ్ర ఎన్నికల ఫలితాలు 2019
మొత్తం సీట్లు – 34
వైసీపీ 28 ( శ్రీకాకుళం – 9, విజయనగరం – 9, విశాఖపట్నం -10 )
వైసీపీ 5 (శ్రీకాకుళం-1, విజయనగరం – 0, విశాఖపట్నం – 4)
ఉమ్మడి విజయనగరం జిల్లా(9 అసెంబ్లీ స్థానాలు)
కురుపాం – పాముల పుష్పశ్రీవాణి
తోయిక జగదీశ్వరి, పువ్వల లావణ్య
పార్వతీపురం – అలజంగి జోగారావు, సిట్టింగ్ ఎమ్మెల్యే, జమ్మాన ప్రసన్నకుమార్, సవరపు జయమణి
బోనెల చిరంజీవి, బొబ్బిలి చిరంజీవులు
సాలూరు – పీడిక రాజన్నదొర, శోభా స్వాతిరాణి
గుమ్మడి సంధ్యారాణి, తేజోవతి, ఉపాధ్యాయురాలు
బొబ్బిలి – శంబంగి వెంకట అప్పలనాయుడు, బేబి నాయన
గజపతినగరం బొత్స అప్పలనరసయ్య,
కొండపల్లి అప్పలనాయుడు, కొండపల్లి శ్రీనివాసరావు, కరణం శివరామకృష్ణ
పడాల అరుణ – జనసేన
చీపురుపల్లి – బొత్స సత్యానారాయణ, కిమిడి నాగార్జున
నెల్లిమర్ల – బడ్డుకొండ అప్పలనాయుడు, కర్రోతు బంగార్రాజు, లోకం మాధవి (జనసేన)
శృంగవరపుకోట – కడుబండి శ్రీనివాసరావు
కోళ్ల లలితకుమారి, గొంప కృష్ణ, ఎన్‌ఆర్‌ఐ
విజయనగరం – కోలగట్ల వీరభద్రస్వామి
అదితి గజపతిరాజు, అశోక్ గజపతిరాజు, మీసాల గీత
—————–
Also Read : వైసీపీకి తలనొప్పిగా మారిన ఆ ఏడు ఎంపీ స్థానాలు..!