Jogi Ramesh: పైన దేవుడున్నాడు.. మీకూ ఫ్యామిలీ ఉంది.. ఎవరినీ వదలను- అరెస్ట్ వార్తలపై జోగి రమేశ్ వార్నింగ్..

రాజ్యాంగబద్ధంగా మీ ఇంటికి నిరసన తెలియజేయడానికి వస్తే ఇలాంటి నీతిమాలిన పనులు చేస్తారా..? అని ధ్వజమెత్తారు.

Jogi Ramesh: పైన దేవుడున్నాడు.. మీకూ ఫ్యామిలీ ఉంది.. ఎవరినీ వదలను- అరెస్ట్ వార్తలపై జోగి రమేశ్ వార్నింగ్..

Updated On : October 31, 2025 / 5:45 PM IST

Jogi Ramesh: కల్తీ మద్యం తయారీ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి జోగి రమేశ్ మరోసారి తేల్చి చెప్పారు. తాను నిరపరాధినని దుర్గమ్మ దగ్గర ప్రమాణం చేశానని చెప్పారు. నేను తప్పు చేశానని చంద్రబాబు, లోకేశ్ లను ప్రమాణం చెయ్యాలని సవాల్ చేశాను, కానీ వారి నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. 20 రోజుల నుండి నాపై తప్పుడు ఆరోపణలు చేశారు, నా మనసు గాయపరిచారు, నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా సీఎం చంద్రబాబు వ్యవహరించారు అని జోగి రమేశ్ విరుచుకుపడ్డారు.

కల్తీ మద్యం కేసులో సీబీఐ విచారణ కు డిమాండ్ చేశా కానీ.. స్పందన లేదన్నారు. లై డిటెక్టిర్ టెస్టుకైనా సిద్ధమని సవాల్ చేశాను, దానికీ స్పందన లేదన్నారు. నార్కో ఎనాలసిస్ టెస్ట్ కి సైతం సిద్ధం అని సవాల్ చేశాను.. దానికి కూడా ఎలాంటి రియాక్షన్ రాలేదన్నారు. సీబీఐ కాకపోతే దేశంలో ఏ సంస్థతో అయినా విచారణ జరపండి అని జోగి రమేశ్ డిమాండ్ చేశారు. నేను తప్పు చెయ్యలేదు, అందుకే ఇంత ధైర్యంగా చెబుతున్నా అని అన్నారు.

జనార్ధనరావు పేరుతో రోజుకో కొత్త స్టోరీ చెబుతున్నారు, ఎవరో స్టేట్‌మెంట్ ఇచ్చారని నన్ను అరెస్టు చేస్తే ఊరుకోను అని హెచ్చరించారు. అక్రమంగా నన్ను జైల్లో వేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారని వార్నింగ్ ఇచ్చారు. నన్ను జైల్లో పెడితే చంద్రబాబు, లోకేష్ లపై పోరాటంలో ఎక్కడా తగ్గను.. గుర్తుపెట్టుకోండి అని జోగి రమేశ్ అన్నారు. రాజ్యాంగబద్ధంగా మీ ఇంటికి నిరసన తెలియజేయడానికి వస్తే ఇలాంటి నీతిమాలిన పనులు చేస్తారా..? అని ధ్వజమెత్తారు. నన్ను అక్రమంగా అరెస్ట్ చేస్తే పైన దేవుడున్నాడు చూస్తూ ఉండడు అని హెచ్చరించారు.

సిట్ అధికారులకు చెబుతున్నా.. మీకూ ఫ్యామిలీ ఉంది.. పైన దేవుడు ఉన్నాడు.. హెచ్చరిక అనుకున్నా సరే రిక్వెస్ట్ అనుకున్నా సరే.. నన్ను అక్రమంగా అరెస్టు చేస్తే ఎవరిని వదిలిపెట్టను అని హెచ్చరించారు జోగి రమేశ్.

Also Read: పొత్తులపై కూటమి పార్టీలు ఫిక్స్.. మరి వైసీపీ ప్లానేంటి? జగన్ స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది?