5 State Election Results : ఎన్నికల ఫలితాలకు జగన్ భయపడుతారు.. ఏపీకి నష్టం చేకూరుస్తాయి

రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేంద్రాన్ని అడగలేని పరిస్థితిలోకి జగన్ వెళ్తారని, బీజేపీ బలపడే కొద్దీ తనపై ఉన్న కేసులతో కేంద్రాన్ని నిలదీయలేని పరిస్థితిలో ఆయన ఉంటారని చెప్పారు.

5 State Election Results : ఎన్నికల ఫలితాలకు జగన్ భయపడుతారు.. ఏపీకి నష్టం చేకూరుస్తాయి

Rammohan Naidu

Updated On : March 10, 2022 / 9:11 PM IST

Srikakulam MP : ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను చూసి ఏపీ సీఎం జగన్ భయపడుతారని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఫలితాలు ఏపీకి నష్టం చేకూరుస్తాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేంద్రాన్ని అడగలేని పరిస్థితిలోకి జగన్ వెళ్తారని, బీజేపీ బలపడే కొద్దీ తనపై ఉన్న కేసులతో కేంద్రాన్ని నిలదీయలేని పరిస్థితిలో ఆయన ఉంటారని చెప్పారు. 2022, మార్చి 10వ తేదీ గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు.

Read More : Telugu Students : చంద్రబాబుతో భేటీ అయిన ఉక్రెయిన్ నుంచి వచ్చిన తెలుగు విద్యార్థులు

జగన్ పై ఉన్న కేసుల భయంతో రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో వైసీపీ ఎంపీలు సైతం అడగలేని పరిస్థితిలో ఉంటారని తెలిపారు. విభజన సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు హక్కులపై 28 మంది ఎంపీలున్నా జగన్ ఇప్పటివరకు ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదన్నారు. సంఖ్యా బలం తక్కువ ఉన్నా రాష్ట్ర హక్కుల కోసం ఢిల్లీలో టీడీపీ ఎంపీలు పోరాటం చేయడం జరుగుతోందన్నారు. ప్రత్యేక హోదా, ఇతర విభజన హామీల సాధనలో వైసీపీపై ఒత్తిడి తెచ్చి హామీలు గుర్తు చేస్తామన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రాన్ని కొరడం జరుగుతుందని, కేంద్ర నిధులను దారి మళ్లించి రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్న తీరును పార్లమెంట్ లో లేవనెత్తుతామన్నారు. అనేక రాష్ట్రాల్లో విజయం సాధిస్తున్న బీజేపీ ఏపీలో ఎందుకు బలపడడం లేదో ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆ పార్టీ నేతలకు సూచించారు.

Read More : Sailajanath On Results : బీజేపీ గెలుపు శాశ్వతం కాదు, త్వరలో పుంజుకుంటాం- శైలజానాథ్

ఏపీ ప్రజలకు చేయాల్సిన న్యాయం చేయలేదని, కాబట్టే ఇక్కడ 1శాతం ఓటు కూడా రావడం లేదని బీజేపీ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రాంతీయ పార్టీలు బలహీనపడుతున్నాయనే వాదనలో నిజం లేదని కొట్టిపారేశారు. సర్పంచ్ ల నిధులు కూడా దుర్వినియోగం చేసి చట్ట విరుద్ధంగా జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు హోంశాఖ చొరవ చూపాలని కొరతామన్నారు. ఉక్రెయిన్ విద్యార్థుల్ని స్వదేశానికి తీసుకురావడంలో టీడీపీ ఎన్నారై విభాగం కీలక పాత్ర పోషించిందనే విషయాన్ని ఆయన తెలిపారు. అక్కడ విశ్వవిద్యాలయాలు మూతపడటం వల్ల అర్ధాంతరంగా చదువు ఆగిపోయే ప్రమాదం ఉందని..వీటిపై కూడా తాము పార్లమెంట్ లో లేవనెత్తుతామని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు.