ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో కఠిన నిబంధనలు

  • Published By: srihari ,Published On : May 10, 2020 / 01:22 PM IST
ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో కఠిన నిబంధనలు

Updated On : May 10, 2020 / 1:22 PM IST

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్ పోస్టుల దగ్గర కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ నుంచి వచ్చే వారిని చెక్ పోస్టుల దగ్గర అధికారులు ఆపేస్తున్నారు. వివరాలను నమోదు చేసుకున్న తర్వాతే తెలంగాణలోకి వచ్చే అవకాశం ఇస్తున్నారు. ప్రతి ఒక్కరికి క్వారంటైన్ స్టాంప్ వేస్తున్నారు. 14 రోజులపాటు ఇంట్లోనే ఉండాలంటూ అధికారులు వారికి చెబుతున్నారు. ఇటు తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వారిని కూడా అధికారులు అనుమతించడం లేదు.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సరిహద్దు జిల్లాలైనా గుంటూరు, కర్నూలుల్లో కేసులు నమోదు ఎక్కువగా ఉన్నాయి. గుంటూరు జిల్లాలో ఇప్పటికే 300 కేసులు నమోదు అయ్యాయి. కర్నూలు జిల్లాలో 551 కేసులు నమోదయ్యాయి. ఈ రెండు జిల్లాల నుంచి తెలంగాణకు వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవ్వరినీ రానియ్యవద్దని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే చెప్పారు. అత్యవసర పనుల నిమిత్తం ప్రత్యేక అనుమతి పత్రాలతో వచ్చే వారు కచ్చితంగా క్వారంటైన్ నిబంధనలను పాటించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 

రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చాలా కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారు. అనుమతి పత్రాలు చెక్ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ, ఆరోగ్య శాఖ… ఈ మూడు శాఖలు సమన్వయం చేసుకుని చెక్ పోస్టు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికీ తెలంగాణ వైపు  కొంత కేసులు తగ్గుతున్నా… గుంటూరు వైపు తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో అధికారులు కొంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ఎవరైతే వస్తున్నారో వారందరి వివరాలు తీసుకోవడంపాటు ఎవ్వరిని కూడా అలక్ష్యం చేయుండా వారందరి పేర్లు నమోదు చేసుకోవాలని, తప్పనిసరిగా వారందరికీ క్వారంటైన్ విధించాలని ఆదేశించింది.