Bomb Threat: తిరుపతి బస్టాండ్ వద్ద కలకలం సృష్టించిన సూట్ కేస్

చిత్తూరు జిల్లా తిరుపతిలో మంగళవారం ఒక అజ్ఞాత వ్యక్తి వదిలి వెళ్లిన సూట్ కేసు కలకలం సృష్టించింది. తిరుపతి బస్టాండ్, శ్రీకాళహస్తి స్టాప్ పాయింట్ వద్ద ఒక సూట్ కేస్ పడి ఉంది

Bomb Threat: తిరుపతి బస్టాండ్ వద్ద కలకలం సృష్టించిన సూట్ కేస్

Tirupati

Updated On : January 11, 2022 / 3:39 PM IST

Bomb Threat: చిత్తూరు జిల్లా తిరుపతిలో మంగళవారం ఒక అజ్ఞాత వ్యక్తి వదిలి వెళ్లిన సూట్ కేసు కలకలం సృష్టించింది. తిరుపతి బస్టాండ్, శ్రీకాళహస్తి స్టాప్ పాయింట్ వద్ద ఒక సూట్ కేస్ పడి ఉంది. సమయం గడుస్తున్నా దాన్ని తీసుకువెళ్లేందుకు ఎవరు రాకపోవడంతో అనుమానం వచ్చిన కొందరు ప్రయాణికులు బస్టాండ్ యాజమాన్య దృష్టికి తీసుకువెళ్లారు. బస్ డిపో సిబ్బంది సమాచారం మేరకు రంగంలోకి దిగిన తిరుపతి అర్బన్ పోలీసులు..,బాంబు, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించారు.

Also read: Rajahmundry Police: రూ.కోటి విలువైన నాటు సారాను ధ్వంసం చేసిన రాజమండ్రి పోలీసులు

దాదాపు 20 నిముషాల పాటు సూట్ కేసును క్షుణ్ణంగా పరిశీలించిన భద్రత సిబ్బంది, అందులో ప్రమాదకర వస్తువులు లేవని నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం సూట్ కేసును తెరిచి చూడగా అందులో సాధారణ దుస్తులు, భోజన క్యారెజ్ బాక్స్ కనిపించింది. బస్ స్టాండ్ కు వచ్చిన ప్రయాణికులెవరైనా సూట్ కేస్ మరిచిపోయి ఉంటారని పోలీసులు భావించారు. ఘటనపై డిపో సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read: Srilanka-India: లగ్జరీ రైలు కోసం శ్రీలంకకు సహకారం అందించిన భారత్