Sun Rays Hit Mulavirat : అరసవల్లి దేవాలయంలో అరుదైన దృశ్యం.. మూలవిరాట్‌ను తాకిన సూర్యకిరణాలు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి దేవాలయంలో శ్రీ సూర్యనారాయణ స్వామి మూలవిరాట్‌ను సూర్యకిరణాలు తాకాయి. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో అరసవల్లికి చేరుకున్నారు. మూలవిరాట్‌ పాదాలను సూర్య కిరణాలు తాకిన దృశ్యాన్ని వీక్షించి భక్తులు పులకించిపోయారు.

Sun Rays Hit Mulavirat : అరసవల్లి దేవాలయంలో అరుదైన దృశ్యం.. మూలవిరాట్‌ను తాకిన సూర్యకిరణాలు

Sun Rays Hit Mulavirat (1)

Updated On : October 1, 2022 / 4:59 PM IST

Sun Rays Hit Mulavirat : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి దేవాలయంలో శ్రీ సూర్యనారాయణ స్వామి మూలవిరాట్‌ను సూర్యకిరణాలు తాకాయి. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో అరసవల్లికి చేరుకున్నారు. మూలవిరాట్‌ పాదాలను సూర్య కిరణాలు తాకిన దృశ్యాన్ని వీక్షించి భక్తులు పులకించిపోయారు. ఏడాదిలో రెండు సార్లు ఇలాంటి అద్భుతం ఆవిష్కృతమవుతుంది.

శ్రీకాకుళం జిల్లా ఆరసవల్లిలోని సూర్య నారాయణుడి ఆలయంలో మూలవిరాట్‌ పాదాలను సూర్య కిరణాలు పాక్షికంగా తాకాయి. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాలు సహా పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. తొలిరోజు సూర్య కిరణాలు స్వామివారి పాదాలను తాకగానే భక్తులు పులకించిపోయారు. ఏటా రెండు సార్లు సూర్య కిరణాలు స్వామి వారి పాదాలను తాకుతాయి.

Srivari Brahmotsavam In Tirumala: తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

దక్షిణాయణం అక్టోబర్ 1, 2 తేదీల్లో, ఉత్తరాయణం మార్చి 9, 10 తేదీల్లో స్వామివారికి కిరణాలు తాకడం ఆనవాయితీగా వస్తుంది. దాదాపు 5 నిమిషాల పాటు సూర్యకిరణాలు స్వామివారి పాదాల చెంత నిలిచాయి. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో భక్తులు వేచి ఉండి స్వామివారిని సూర్యకిరణాలు తాకడం చూసి పులకించిపోయారు.

ఆదిత్యుని విగ్రహంపై పడిన లేలేత కిరణాలు దర్శనమివ్వడంతో జన్మధన్యమైందంటూ భక్తులు సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు చేశారు. సూర్యకిరణాలు తాకే సమయానికి సూర్యనారాయణమూర్తిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.