Chandrababu : స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో నేడు కీలక పరిణామాలు.. చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై కొనసాగుతున్న ఉత్కంఠ

ఏసీబీ కోర్టు ముందుగా ఏ పిటిషన్ పై విచారణ జరుపుతుంది? న్యాయ స్థానం ఎలా ఉంటుందన్నది సస్పెన్స్ గా మారింది.

Chandrababu : స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో నేడు కీలక పరిణామాలు.. చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై కొనసాగుతున్న ఉత్కంఠ

Chandrababu bail and custody petitions

Updated On : September 26, 2023 / 9:18 AM IST

Chandrababu Bail and Custody Petitions : స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో నేడు(మంగళవారం) కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టు ఇవాళ(మంగళవారం) వాదనలు విననుంది. చంద్రబాబు కస్టడీ పిటిషన్ ను ముందుగా విచారించాలని సీఐడీ, చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను ముందుగా విచారించాలని చంద్రబాబు తరపు లాయర్లు నిన్న(సోమవారం) పట్టుబట్టారు.

అయితే, రెండు పిటిషన్లపై విచారణ జరిపేందుకు సిద్ధమన్న న్యాయమూర్తి ఓకే సారి రెండు అంశాలకు సంబంధించి తీర్పులు ఇస్తానని వివరించారు. అయినప్పటికీ బెయిల్ పిటిషన్ పై ముందుగా విచారణ జరపాలని చంద్రబాబు తరపు లాయర్లు పట్టుబడుతుండటంతో విచారణను నేటికి (గురువారం) వేయిదా వేశారు. న్యాయ పరైమన అంశాలను పరిశీలించి ఇవాళ (మంగళవారం) రెండింటిలో ఏదో ఒక పిటిషన్ ను విచారణ చేస్తానని, ఆ తర్వాత రెండో పిటిషన్ పై విచారణ జరుపుతానని న్యాయమూర్తి తెలిపారు.

CM Jagan : జైల్లో చంద్రబాబు.. ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ఇదే సరైన సమయమా? సీఎం జగన్ నిర్ణయం ఏంటి?

దీంతో ఇవాళ ఏసీబీ కోర్టు ముందుగా ఏ పిటిషన్ పై విచారణ జరుపుతుంది? న్యాయ స్థానం ఎలా ఉంటుందన్నది సస్పెన్స్ గా మారింది. మరోవైపు చంద్రబాబు క్వాష్ పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో లిస్టింగ్ కు వస్తుందా? రాదా? అన్నది కూడా ఉత్కంఠ రేపుతోంది.  చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థ లూద్రా మెన్షన్ చేసి అత్యవసరంగా విచారించాలని కోరారు.

ఇది ఏపీకి చెందిన వ్యవహారమని, అక్కడ ప్రతిపక్షాలను అణిచి వేస్తున్నారని లూద్రా ప్రస్తావించారు. దీంతో ఇవాళ మెన్షన్ లిస్టు ద్వారా రావాలని లూద్రాకు సీజేఐ సూచించారు. క్వాష్ పిటిషన్ ను ప్రస్తావించడానికి సీజేఐ డీవై చంద్రచూడ్ ధర్మాసనం అనుమతించింది.

Nara Bhuvaneswari : చంద్రబాబు ధైర్యవంతుడు, మీ కుట్రలు ఫలించవు, భోంచేయడానికి టేబుల్ కూడా ఇవ్వలేదు- నారా భువనేశ్వరి

మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు, ఏపీ ఫైబర్ నెట్ పై కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. ఇదిలావుంటే ఈరోజు హైకోర్టు ఇన్నర్ రింగ్ రోడ్డు ముందస్తు బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ జరుగనుంది. అలాగే అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగనుంది.