ఎస్‌ఈసీ నిమ్మగడ్డ చిత్తూరు జిల్లా పర్యటనపై పోలీసుల్లో టెన్షన్

SEC Nimmagadda’s visit to Chittoor : చిత్తూరు జిల్లాలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పర్యటనపై సస్పెన్స్ కొనసాగుతోంది. మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గం పుంగనూరులో ఎస్‌ఈసీ పర్యటిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే నిమ్మగడ్డ పుంగనూరు పర్యటనపై సమాచారం లేదని అధికార యంత్రాంగం అంటోంది.
మరోవైపు నిమ్మగడ్డ పుంగనూరు పర్యటన ప్రచారంపై పోలీసుల్లో టెన్షన్ నెలకొంది. శాంతిభద్రతల సమస్యలు రావొచ్చని పోలీసు యంత్రాంగం ఆందోళన చెందుతోంది. ఇప్పటికే పుంగనూరు నియోజకవర్గంలోని 5 మండలాల్లో అన్ని స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.
దీంతో స్వయంగా ఏకగ్రీవాల తీరు పరిశీలించేందుకు వెళ్లాలన్న యోచనలో ఎస్‌ఈసీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తెల్లవారుజామున తిరుమల వెళ్లిన నిమ్మగడ్డ… శ్రీవారిని దర్శించుకున్నారు.