Suspicious Death : అన్నకు రాఖీ కట్టి వచ్చిన రెండు గంటలకే చెల్లి అనుమానాస్పద మృతి

విజయవాడలోని ఆరంబల్‌పేటలో రాఖీ పండుగ పూట విషాదం నెలకొంది. అనుమానాస్పద స్థితిలో ఉష అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని చనిపోయింది. అయితే ఉషను అత్తింటివారే చంపారని ఆమె తల్లి ఆరోపిస్తున్నారు.

Suspicious Death : అన్నకు రాఖీ కట్టి వచ్చిన రెండు గంటలకే చెల్లి అనుమానాస్పద మృతి

Software Employee

Updated On : August 23, 2021 / 1:20 PM IST

software employee Suspicious death : విజయవాడలోని ఆరంబల్‌పేటలో విషాదం నెలకొంది. అనుమానాస్పద స్థితిలో ఉష అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని చనిపోయింది. రాఖీ పండుగ రోజున ఆమె ఇంట్లో విషాదం నెలకొంది. రెండేళ్ల క్రితం ఉష.. ఫణి అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులే. అప్పటి నుంచి అత్తింటివారి ఇంట్లోనే ఉంటోంది. అయితే ఉషను అత్తింటివారే చంపారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

రాఖీ కట్టిన రెండు గంటల్లోనే తన చెల్లి శవం ఎట్లా అయ్యిందో అర్థం కావడం లేదని సోదరుడు సత్యనారాయణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాఖీ కట్టి తిరిగి అత్తవారింటికి వెళ్లిన ఉష ఎలా శవమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన చెల్లి చావుకు కారణం అత్తింటివారేనని చెబుతున్నారు.

ఫణికి ఆదాయం తక్కువ రావడం, ఉషకు ఆదాయం ఎక్కువ రావడంతో అత్తింటివారు తీవ్ర వేధింపులకు గురి చేశారని ఆరోపిస్తున్నారు. మూడు రోజుల క్రితం సింధు మృతి ఘటన మరువకముందే.. మరో యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోవడం స్థానికంగా కలకలం రేపుతోంది.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉష చావుకు కారణం అత్తింటివారా? ఇతర కారణాలున్నాయా అన్న కోణంలో విచారణ చేపట్టారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత అసలు విషయాలు బయటికొస్తాయని పోలీసులు చెబుతున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు, నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.