Andhra Pradesh : సీఎం జగన్ కీలక సమావేశం.. డేట్ ఫిక్స్

రీజినల్ కో ఆర్డినేటర్లు, మంత్రులు, జిల్లా అధ్యక్షులు, ఇతర కీలక నేతలతో భేటీ కానున్నారు. 2022, ఏప్రిల్ 27వ తేదీన జరిగే ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ వ్యూహాలపై నేతలకు ఆయన దిశానిర్ధేశం చేయనున్నారు...

Andhra Pradesh : సీఎం జగన్ కీలక సమావేశం.. డేట్ ఫిక్స్

Ys Jagan Mohan Reddy

Updated On : April 24, 2022 / 8:40 PM IST

Jagan Target 2024 : ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు సీఎం జగన్. అధికారంలో మరోసారి వచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా ఇటీవలే రెండోసారి మంత్రివర్గ విస్తరణ చేసి పెద్ద సాహసమే చేశారు. అంతేగాకుండా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి వాటికి పార్టీ అధ్యక్షులుగా పలువురిని నియమించారు. ప్రతిపక్షాలపై ఎన్నడూ లేని విధంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతిపక్షాలు ఇప్పటికే యాక్టివ్ కావడంతో ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఆయన దృష్టి సారించారు. అందులో భాగంగా ఓ కీలక సమావేశం ఏర్పాటు చేశారు సీఎం జగన్.

Read More : AP CM Jagan: ఒంగోలుకు సీఎం జగన్: సున్నా వడ్డీ పధకం నిధులు విడుదల

రీజినల్ కో ఆర్డినేటర్లు, మంత్రులు, జిల్లా అధ్యక్షులు, ఇతర కీలక నేతలతో భేటీ కానున్నారు. 2022, ఏప్రిల్ 27వ తేదీన జరిగే ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ వ్యూహాలపై నేతలకు ఆయన దిశానిర్ధేశం చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లి గూడెం సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం ఉండబోతోంది. ఈ సమావేశం కీలకంగా భావిస్తున్నారు. మే 02వ తేదీ నుంచి గడపగడపకు వైసీపీ ప్రభుత్వం అంటూ వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. 2024లోపు.. పార్టీ మరింత బలోపేతం కావాలని సీఎం జగన్ సూచించినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా.. త్వరలోనే క్షేత్రస్థాయిలో సీఎం జగన్ పర్యటించనున్నట్లు సమాచారం. పొత్తులపై పార్టీలకు సంబంధించిన నేతలు వివిధ వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం జగన్ కీలక సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Read More : CM Jagan-Anil Kumar : సీఎం జగన్ తో మాజీ మంత్రి అనిల్ కుమార్ భేటీ

ఎన్నికలకు ఇంకా సమయం చాలానే ఉంది. అప్పుడే రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. పొత్తులపై చర్చలు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఏపీలో మళ్లీ అధికారమే దిశగా వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. ఒంటరిగానే పోటీ చేస్తుందా ? లేదా ఇతర పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా ? అనే ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే.. త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని భావిస్తున్న ప్రశాంత్ కిశోర్.. ఆ పార్టీ అధిష్టానానికి ఓ నివేదిక ఇచ్చినట్లు.. అందులో ఏపీలో వైసీపీతో పొత్తు పెట్టుకోవాలని సూచించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ ప్రతిపాదన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ పొత్తులపై వైసీపీ నేతలు విభిన్నంగా స్పందించారు. ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో ఆయన పలు దఫాలు సమావేశమైనట్లు తెలుస్తోంది. జగన్ తో ప్రశాంత్ కిశోర్ ఐ ప్యాక్ టీమ్ కలిసి పనిచేస్తోంది. కాంగ్రెస్ – వైసీపీ పార్టీల మధ్య పొత్తు పొడుస్తుందా ? లేదా ? సీఎం జగన్ జరిపే కీలక సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు వెలువడుతాయో చూడాలి.