AP TDP : సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా మారుస్తున్నారు – బాబు
ఉగ్రవాదుల్ని మించిన పాలన వైసీపీ కొనసాగిస్తోందని ఘాటు వ్యాఖ్యాలు చేశారాయన. ఇటీవలే జరిగిన స్థానిక ఎన్నికల్లో అరాచకాలు చోటు చేసుకున్నాయని,...

Chandrababu
TDP Chief Chandrababu Naidu : ప్రజలతో నేరుగా గెలుపొందిన సర్పంచ్ లను ఉత్సవ విగ్రహాలుగా మారుస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు. ప్రధాని, ముఖ్యమంత్రికి ఉన్న సమాన అధికారాల్ని రాజ్యాంగం సర్పంచ్ లకు కల్పిస్తే వాటిని హరించడానికి సీఎం జగన్ ఎవరని ప్రశ్నించారు. 2022, ఫిబ్రవరి 17వ తేదీ గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో స్థానిక ఎన్నికల్లో గెలిచిన టీడీపీ సర్పంచ్ లకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సును చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
Read More : JC Prabhakar Reddy: ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై మండిపడ్డ జేసి ప్రభాకర్ రెడ్డి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు. ఉగ్రవాదుల్ని మించిన పాలన వైసీపీ కొనసాగిస్తోందని ఘాటు వ్యాఖ్యాలు చేశారాయన. ఇటీవలే జరిగిన స్థానిక ఎన్నికల్లో అరాచకాలు చోటు చేసుకున్నాయని, ఎన్నికల ప్రచారం చేయకుండా చేశారని విమర్శించారు. ఇంత చేసినా… టీడీపీ తరపున ఎన్నికల్లో నిలబడి పోరాడి గెలిచారని అభివర్ణించారు. ముఖ్యమంత్రిగా అధికారం కట్టబెట్టింది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడానికి కాదని, హక్కుల కోసం సర్పంచ్ లు చేసే పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. గ్రామాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు.