పొత్తులతో జనసేన సీట్లకు ఎఫెక్ట్.. ఒక ఎంపీ స్థానాన్ని బీజేపీకి త్యాగం చేసిన పవన్!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో మూడు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్నామని ఇప్పటికే ప్రకటించారు. కాకినాడ, మచిలీపట్నం, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల్లో జనసేన పోటీచేసేందుకు సిద్ధపడింది.

పొత్తులతో జనసేన సీట్లకు ఎఫెక్ట్.. ఒక ఎంపీ స్థానాన్ని బీజేపీకి త్యాగం చేసిన పవన్!

Pawan Kalyan

BJP TDP Janasena Alliance : ఏపీలో మరికొద్ది నెలల్లో జరగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కూటమిగా వెళ్తున్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేన పార్టీ 24 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాల్లో పోటీచేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇప్పటికే ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులను సైతం ప్రకటించారు. తాజాగా టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీకూడా చేరింది. ఈ క్రమంలో బీజేపీకి కేటాయించే ఎంపీ, అసెంబ్లీ సీట్ల విషయంలో గత మూడు రోజులుగా అమిత్ షాతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఢిల్లీలో చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల్లో భాగంగా బీజేపీ ఎనిమిది ఎంపీ స్థానాలను కోరుతూ వచ్చింది. శనివారం ఉదయం మరోసారి అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారు. ఈ భేటీలో సీట్ల పంపకంపై క్లారిటీ వచ్చినట్లు తెలిసింది. బీజేపీ, జనసేన పార్టీలకు కలిపి మొత్తం ఎనిమిది ఎంపీ సీట్లతోపాటు 30 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు అంగీకారం తెలిపినట్లు సమాచారం.

Also Read : తెలంగాణలో పోటీకి టీడీపీ, జనసేన దూరం.. ఢిల్లీ నుంచి కిషన్ రెడ్డికి పిలుపు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్నామని ఇప్పటికే ప్రకటించారు. కాకినాడ, మచిలీపట్నం, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల్లో జనసేన పోటీచేసేందుకు సిద్ధపడింది. తాజా పరిణామాల నేపథ్యంలో టీడీపీ – జనసేన కూటమిలో బీజేపీసైతం చేరడంతో ఒక ఎంపీ స్థానాన్ని త్యాగం చేసేందుకు పవన్ సిద్ధపడినట్లు తెలిసింది. కాకినాడ సీటును వదులుకోవడానికి పవన్ అంగీకారం తెలిపినట్లు సమాచారం. దీంతో జనసేన రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో, బీజేపీ ఆరు పార్లమెంట్ నియోజకవర్గాల్లో మిగిలిన నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు తెలిసింది.

Also Read : Rahul gandhi : 39మందితో తొలి లిస్ట్‌ను ప్రకటించిన కాంగ్రెస్‌ అధిష్టానం

అసెంబ్లీ నియోజకవర్గాల విషయంలో బీజేపీ, జనసేన పార్టీలు కలిసి 30 సీట్లలో పోటీ చేసేందుకు అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ 24 సీట్లలో జనసేన అభ్యర్థులను పోటీలో నిలిపేందుకు సిద్ధమయ్యారు. మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ బీజేపీ అధిష్టానం అసెంబ్లీ స్థానాల్లోనూ ఆరుకంటే అదనంగా సీట్లు ఆశిస్తే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన 24 అసెంబ్లీ స్థానాల్లో నుంచి ఒకటిరెండు స్థానాలనుసైతం త్యాగం చేసేందుకు సిద్ధపడతారా అనే అంశంపై ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.