TDP-Janasena : నేటి నుంచి టీడీపీ – జనసేన సమన్వయ సమావేశాలు.. పర్యవేక్షకులుగా రెండు పార్టీల సీనియర్ నేతలు

జిల్లాల్లో జరిగే సమన్వయ సమావేశాలకు పర్యవేక్షణ నిమిత్తం రెండు పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున సీనియర్ నేతలు హాజరు కానున్నారు.

TDP-Janasena : నేటి నుంచి టీడీపీ – జనసేన సమన్వయ సమావేశాలు.. పర్యవేక్షకులుగా రెండు పార్టీల సీనియర్ నేతలు

TDP-Janasena meetings

Updated On : October 29, 2023 / 8:55 AM IST

TDP-Janasena Meetings : ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి టీడీపీ – జనసేన సమన్వయ సమావేశాలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాల వారీగా టీడీపీ – జనసేన సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ రోజు, రేపు, ఎల్లుండి (29, 30, 31వ తేదీల్లో) జిల్లాల్లో సమన్వయ సమావేశాలు జరుగున్నాయి. జిల్లాల్లో జరిగే సమన్వయ సమావేశాలకు పర్యవేక్షణ నిమిత్తం రెండు పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున సీనియర్ నేతలు హాజరు కానున్నారు.

టీడీపీ-జనసేన పర్యవేక్షకులు..
శ్రీకాకుళం- వంగలపూడి అనిత, బొమ్మిడి నాయకర్, విజయనగరం- బుద్దావెంకన్న, కోన తాతారావు, తూర్పుగోదావరి కొల్లు.రవీంద్ర, శివ శంకర్, ప్రకాశం- దేవినేని ఉమ, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, అనంతపురం ఎన్ఎండీ ఫరూక్, చిల్లపల్లి శ్రీనివాస రావు, పశ్చిమగోదావరి నక్కా ఆనంద్ బాబు, యశస్వీ, కృష్ణా- బండారు సత్యనారాయణ మూర్తి, చేగొండి సూర్య ప్రకాష్ లు పర్యవేక్షకులుగా వ్యవహరించనున్నారు.

కడప- సోమిరెడ్డి, నయూబ్ కమల్, చిత్తూరు- బీదా రవిచంద్ర, బోలిశెట్టి సత్య, విశాఖ- నిమ్మల, పడాల అరుణ, గుంటూరు- షరీఫ్, ముత్తా శశిధర్, నెల్లూరు- ఎన్ అమర్నాధ్ రెడ్డి, పితాని బాలకృష్ణ, కర్నూలు- కాల్వ, పెదపూడి విజయ్ కుమార్ లు పర్యవేక్షించనున్నారు.

టీడీపీ, జనసేన సమన్వయ సమావేశాల షెడ్యూల్..
టీడీపీ, జనసేన సమన్వయ సమావేశాల షెడ్యూల్ విడుదల చేశారు. ఈ రోజు (ఆదివారం) శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో సమన్వయ సమావేశాలు జరుగున్నాయి.

రేపు ఆదివారం(అక్టోబర్30,2023)న పశ్చిమ గోదావరి కృష్ణా, చిత్తూరు, కడప జిల్లాల్లో, ఎల్లుండి సోమవారం (అక్టోబర్ 31,2023)న విశాఖ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో టీడీపీ – జనసేన సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నారు.