ఆలయాల్లో విగ్రహాలు దొంగతనం చేయలేదని మాచర్ల సెంటర్‌లో ప్రమాణం చేస్తావా? -పిన్నెల్లికి బుద్ధా వెంకన్న సవాల్

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కేసు స్టడీ కింద తీసుకోవాలని తన ఎమ్మెల్యేలకు జగన్ చెబుతున్నారు. మాచర్ల నియోజకవర్గ ప్రజలు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెబుతారు.

ఆలయాల్లో విగ్రహాలు దొంగతనం చేయలేదని మాచర్ల సెంటర్‌లో ప్రమాణం చేస్తావా? -పిన్నెల్లికి బుద్ధా వెంకన్న సవాల్

Buddha Venkanna Challenge Pinnelli Ramakrishna Reddy (Phoro Credit : Facebook, Google)

Pinnelli Ramakrishna Reddy : మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నిప్పులు చెరిగారు టీడీపీ నేతలు. పిన్నెల్లిపై తీవ్ర ఆరోపణలు చేశారు. పిన్నెల్లికి సవాల్ చేశారు. దేవాలయాల్లో విగ్రహాలు దొంగతనాలు చేయలేదని మాచర్ల సెంటర్ లో ప్రమాణం చేస్తావా? అని పిన్నెల్లికి సవాల్ విసిరారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న.

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గ్రానైట్, సున్నపు రాయి అక్రమ దోపిడీ ద్వారా దాదాపు 1200 కోట్లు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. పిన్నెల్లి అనుచరులు, మాఫియా 8 హత్యలు చేశారని బుద్ధా వెంకన్న చెప్పారు. వివిధ వర్గాలకు చెందిన 79మందిపై దాడులకు పాల్పడ్డారని అన్నారు. పిన్నిల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలతో నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద మాచర్ల నియోజవర్గ ప్రజలు తిరుగుబాటు మొదలుపెట్టారని వ్యాఖ్యానించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలకు 2024లో పుల్ స్టాప్ పడిందన్నారు బుద్ధా వెంకన్న.

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పిన్నెల్లి పైశాచికం పేరుతో టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, దేవినేని ఉమా, అశోక్ బాబు, తదితరులు పుస్తకం రిలీజ్ చేశారు. పుస్తకంలో పిన్నెల్లి హయాంలో జరిగిన ఘటనలను వివరాలతో ముద్రించారు.

కిశోర్-న్యాయవాది
2021 మార్చి 11వ తేదీన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు స్వయంగా నా మీద దాడికి పాల్పడ్డారు. పోలీస్ కస్టడీలోనే అరాచకాలు చేస్తున్నారు. పోలీసులే అతని సైన్యంగా పని చేస్తున్నారు. కొంతమంది పోలీసులు పిన్నెల్లి అరాచకాలకు మద్దతు పలుకుతున్నారు. మాచర్ల ఎన్నికలు పూర్తైన తర్వాత కూడా పిన్నెల్లి సోదరులు అరాచకాలు చేస్తున్నారు.

దేవినేని ఉమా..
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కేసు స్టడీ కింద తీసుకోవాలని తన ఎమ్మెల్యేలకు జగన్ చెబుతున్నారు. మాచర్ల నియోజకవర్గ ప్రజలు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెబుతారు.

Also Read : ఆ 4 నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీదే అధికారం..! ఏపీ ఎన్నికల్లో ఈసారి ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?