Buddha Venkanna: అవినాశ్ ఇంటికి సీఎం జగన్ వెళ్లడానికి అసలు కారణం అదే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు
జగన్ మోహన్ రెడ్డి పన్నిన వ్యూహంలో దేవినేని అవినాశ్ భాగస్వామి అయితే అతను బలిపశువు కావడం ఖాయమని బుద్దా వెంకన్న అన్నారు.

Buddha Venkanna
TDP Leader Buddha Venkanna : టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuva Galam Padayatra) శనివారం విజయవాడలో అడుగుపెట్టనుంది. ప్రకాశం బ్యారేజీ మీదుగా లోకేశ్ పాదయాత్ర జిల్లాలోకి రానుంది. ఈ సందర్భంగా టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన లోకేశ్ స్వాగత ప్లెక్సీలతో ప్రకాశం బ్యారేజీ పసుపుమయంగా మారింది. పాదయాత్ర సాగే మార్గం మొత్తం కేశినేని చిన్ని (శివనాధ్) ఆధ్వర్యంలో భారీ ప్లెక్సీలు, స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. స్వాగత ఏర్పాట్లను కేశినేని చిన్ని (Keshineni Chinni), బుద్దా వెంకన్న(Buddha Venkanna) ఇతర టీడీపీ నేతలు పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. సీఎం జగన్ మోహన్ రెడ్డి దేవినేని అవినాశ్ ఇంటికి వెళ్లడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కుట్రలో భాగంగానే శుక్రవారం ముఖ్యమంత్రి జగన్ దేవినేని అవినాశ్ ఇంటికి వెళ్లారని బుద్దా వెంకన్న ఆరోపించారు. లోకేష్ పాదయాత్రను, గన్నవరంలో బహిరంగ సభకు ఆటంకపర్చాలని కుట్ర జరుగుతోందని, దానిలో భాగంగానే ఇరువురు భేటీ జరిగిందని బుద్దా అన్నారు. ఎప్పుడో ప్రారంభించిన హోటల్‌ని మరోసారి సీఎం ఓపెన్ చేయటం ఏంటి అని బుధ్దా వెంకన్న ప్రశ్నించారు. ఒకవేళ ఎవరైనా మా పాదయాత్రను అడ్డుకోవాలని చూసిన, ఇబ్బందులు కలిగించాలని చూసిన దీటైన జవాబు ఇస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
Vijayawada: విజయవాడ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. అవినాష్ ఇంటికి సీఎం జగన్
జగన్ మోహన్ రెడ్డి పన్నిన వ్యూహంలో దేవినేని అవినాశ్ భాగస్వామి అయితే అతను బలిపశువు కావడం ఖాయమని బుధ్దా అన్నారు. విజయవాడ సిటీలో ముగ్గురు అభ్యర్థులను ప్రకటించడానికి సజ్జల ఎవరు? విజయవాడ సిటీలో వైసీపీ మట్టి కొట్టుకుపోవడం ఖాయమన్నారు. యార్లగడ్డను జగన్ వాడుకొని వదిలేశాడు. వైసీపీలో నోరేసుకు పడే నేతలు కూడా బలి పశువులు కావడం ఖాయమని అన్నారు. యార్లగడ్డ టీడీపీలోకి రాకను స్వాగతిస్తున్నామని, ఆయన అపాయింట్మెంట్ విషయం హై కమాండ్ చూసుకుంటుందని చెప్పారు. యార్లగడ్డ రాకతో పార్టీ బలోపేతం అవుతుందని బుద్దా అన్నారు.