కొడాలి నానిపై పోలీసులకు దేవినేని ఉమ ఫిర్యాదు

ఏపీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత దేవినేని ఉమ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవినేని ఉమ టీడీపీ నేతలతో కలిసి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో కొడాలి నానిపై ఫిర్యాదు చేశారు. ఏపీ సీఎం జగన్ ప్రేరణతోనే కొడాలి నాని, వసంత కృష్ణ ప్రసాద్, వంశీ తనపై బెదిరింపులకు దిగారని ఫిర్యాదు చేశారు. తనను లారీతో తొక్కించి చంపుతామని బెదిరించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో దేవినేని ఆరోపించారు.
https://10tv.in/reason-behind-tdp-leader-payyavula-keshav-becomes-silent/
అయినా తనను లారీతో గుద్దిస్తానని మంత్రి నాని అనడం ఏంటి? అని దేవినేని ఉమ ప్రశ్నించారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? అని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. నాని మాటల వెనుక జగన్ ఉన్నారంటూ ఆయన ఆరోపించారు. నానిపై వెంటనే చర్యలు తీసుకోవాలని దేవినేని డిమాండ్ డిమాండ్ చేశారు.
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుపై, దేవినేని ఉమపై మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు విమర్శించారు. మనుషులెవరూ కొడాలి నానిలా మాట్లాడరని, ప్రతిపక్ష నేతలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.