Nara Lokesh : కోడికత్తి లాగే ఇది కూడా కొత్త డ్రామా- సీఎం జగన్ పై నారా లోకేశ్ ఫైర్

మన పోలీసులను తెలంగాణకు పంపి గొడవలు పెడతారు, తెలంగాణ పోలీసులతో మన పోలీసులపై కేసులు పెట్టించారు.

Nara Lokesh : కోడికత్తి లాగే ఇది కూడా కొత్త డ్రామా- సీఎం జగన్ పై నారా లోకేశ్ ఫైర్

Nara Lokesh Fires On CM Jagan (Photo : Google)

కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ లో బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడారు. సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. చంద్రబాబు ని చూసినా, పవన్ ని చూసినా జగన్ కు భయమేస్తోందన్నారు. చివరికి చెల్లిని చూసినా, ప్రజలను చూసినా జగన్ కి భయం కలుగుతోందన్నారు. అందుకే పరదాలు కట్టుకుని వస్తారని విమర్శించారు లోకేవ్. కనీసం ఒక్క ఆరోపణను కూడా ఈ ప్రభుత్వం నిరూపించలేకపోయిందన్నారు.

జగన్.. వారానికి 2రోజులు సెలవు తీసుకునే వారు..
సైకో జగన్ పాదయాత్రలో వారానికి రెండు రోజులు సెలవు తీసుకునేవారని లోకేశ్ గుర్తు చేశారు. కానీ, యువగళం పాదయత్రకి బ్రేకులు లేవు, సెలవులు లేవు, పండగలు లేవన్నారు. ఆఖరికి గొంతు బాగోకపోయినా యాత్ర ఆగదన్నారు. సాగనిస్తే ఇది పాదయాత్ర లేక పోతే శవయాత్ర అని కామెంట్ చేశారు. ఎప్పుడూ రాని కరవు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ని ఇబ్బంది పెడుతోందని లోకేశ్ వాపోయారు. ఈ సీఎం.. రైతులను పెట్టించుకోరని ధ్వజమెత్తారు. మన పోలీసులను తెలంగాణకు పంపి గొడవలు పెడతారు, తెలంగాణ పోలీసులతో మన పోలీసులపై కేసులు పెట్టించారు, కోడికత్తి లాగానే ఇదీ కొత్త డ్రామా అని అనుమానం వ్యక్తం చేశారు లోకేశ్.

Also Read : మా నీటిని మేం దక్కించుకునేందుకు చేసింది దండయాత్ర ఎలా అవుతుంది.? : మంత్రి అంబటి రాంబాబు

జగన్ బినామీయే ఈ దోపిడీ శేఖర్..
”ఉద్యోగాలు లేవని యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 6 నెలల్లో 20లక్షల ఉద్యోగాలిచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలండర్ తీసుకొస్తాను. కాకినాడ, కాకినాడ రూరల్ అభివృధి కోసం ఆ రోజుల్లో 400 కోట్లు ఖర్చు పెట్టారు. కాకినాడ రూరల్ లో కలెక్షన్ కింగ్ కన్నబాబు పేరు.. కరప్షన్ కన్నా.. ఈ కరప్షన్ కన్నా వేధింపుల కారణంగా యువ డాక్టర్ కిరణ్ చనిపోయాడు. కాకినాడ రూరల్ లో ఎన్నో హామీలు ఇచ్చి ఒక్కటి కూడా చెయ్యలేదు. కాకినాడ సిటీ అభివృధి జరగలేదు. కానీ, ద్వారంపూడి కుటుంబం బాగుపడింది. ప్యారడైజ్ సిటీని డ్రగ్స్ సిటీగా మార్చేశారు. చంద్రశేఖర్ రెడ్డి పేరు దోపిడీ శేఖర్. చెయ్యని అవినీతి లేదు. జగన్ కి బినామీనే ఈ దోపిడీ శేఖర్” అంటూ నిప్పులు చెరిగారు లోకేశ్.

Also Read : జగన్ మహాత్ముడైతే మనం ఒంటరిగా పోటీ చేయొచ్చు, రాబోయే 3నెలలు అత్యంత కీలకం- పవన్ కల్యాణ్