Somireddy : జగన్ అన్నపూర్ణ లాంటి ఆంధ్ర‌ప్రదేశ్‌ను అరాచక ఆంధ్ర‌ప్రదేశ్‌గా మార్చేశారు : సోమిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది..జగన్ అన్నపూర్ణ ఆంధ్ర ప్రదేశ్ ను అరాచక ఆంధ్ర ప్రదేశ్ గా మార్చేశాడు అంటూ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు

Somireddy : జగన్ అన్నపూర్ణ లాంటి ఆంధ్ర‌ప్రదేశ్‌ను అరాచక ఆంధ్ర‌ప్రదేశ్‌గా మార్చేశారు : సోమిరెడ్డి

Somireddy Chandramohan Reddy

Somireddy Chandramohan Reddy : ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది..జగన్ అన్నపూర్ణ ఆంధ్ర ప్రదేశ్ ను అరాచక ఆంధ్ర ప్రదేశ్ గా మార్చేశాడు అంటూ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు..వేధింపులకు గురి చేస్తున్నారు అంటూ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని ఎదుర్కోలేక అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపించారని లోకేశ్ ను కూడా అరెస్ట్ చేసే కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో అవకతవకలు జరగలేదు అంటూ స్పష్టం చేశారు. దానికి తగ్గిన అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు.పులివెందుల స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయం నుంచి మొదలు పెడతాం..అన్ని కంప్యూటర్లు,పరికరాలు ఉన్నాయో లేదా పరిశీలిద్దాం రండి..అంటూ సవాల్ విసిరారు. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిని చంపేశారు…రింగ్ రోడ్ కేసును కూడా మోపాలని చూస్తున్నారు ఇటువంటి అసమర్ధ పాలనతో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.అమరావతి లేనే లేదు రింగ్ రోడ్ లేదు అయినా దానిమీద కూడా కేసులు పెట్టారని మండిపడ్డారు.