Andhra Pradesh : ఏపీలో ప్రతీ మహిళకు ‘జగనన్న రివాల్వర్ లైసెన్స్‌డ్ పథకం’ ఏర్పాటు చేయండీ : మాజీ ఎమ్మెల్యే అనిత

ఏపీలో ప్రతీ మహిళకు ‘జగనన్న రివాల్వర్ లైసెన్డ్ పథకం’ ఏర్పాటు చేసి అమలు చేయాాలి అంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే..టాడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత వైసీపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.

Andhra Pradesh : ఏపీలో ప్రతీ మహిళకు ‘జగనన్న రివాల్వర్ లైసెన్స్‌డ్ పథకం’ ఏర్పాటు చేయండీ : మాజీ ఎమ్మెల్యే అనిత

Leader Vangalapudi

Updated On : January 11, 2023 / 5:21 PM IST

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో జగన్ పేరుతో అన్ని పథకాలు పెడుతున్నారు కదా.. ప్రతీ మహిళలకు ‘జగనన్న రివాల్వర్ లైసెన్డ్ పథకం’ అనేది కూడా పెట్టాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. ఈ పథకానికి ఏర్పాటు చేస్తే ఈ పథకానికి సహకరించాల్సిందిగా అసెంబ్లీలో కూర్చుకుని గన్ కంటే ముందు జగన్ అన్న వస్తారంటూ సినిమా డైలాగులు చెప్పిన రోజా..హోమ్ కు మాత్రమే పరిమితమైన హోమ్ మినిష్టర్ ని..జగన్ కమిషన్ గా మారిన మహిళా కమిషన్ తో పాటు వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు అంతా సహకరించాలని శిరస్సు వంచి కోరుతున్నానని అన్నారు అనిత. ఏపీలో మహిళలకు లైసెన్డ్ రివాల్వర్లు ఇప్పించండీ అంటూ ఎద్దేవా చేశారు.

ఏపీలో వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అనిత విమర్శించారు. ఏపీలో ఆడబిడ్డలకు అన్యాయం జరగకుండా జగన్ చూస్తారని రక్షణ ఇస్తారని గన్ కంటే ముందు జగన్ అన్న వస్తారని ప్రగల్బాలు పలికిన రోజా ఏపీలో ఇంతమంది మహిళలకు అన్యాయం జరుగుతుంటే అఘాయిత్యాలకు..అత్యాచారాలకు గురి అవుతుంటే గన్ కంటే ముందు జగన్ అన్న వస్తారని ప్రగల్బాలు పలికి రోజా ఎక్కడుంది? హోమ్ కు మాత్రమే పరిమితమైన హోమ్ మినిష్టర్ ఎక్కడున్నారు? అని అతని ప్రశ్నించారు.