Varla Ramaiah : డీజీపీ గౌతమ్ సవాంగ్ కు వర్ల రామయ్య బహిరంగ లేఖ

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు టీడీపీ నేత వర్ల రామయ్య బహిరంగ లేఖ రాశారు. డీజీపీ సవాంగ్‌, ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డికి మధ్య జరిగిన రహస్య ఒప్పందం రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలన్నారు.

Varla Ramaiah : డీజీపీ గౌతమ్ సవాంగ్ కు వర్ల రామయ్య బహిరంగ లేఖ

Varla Ramaiah

Updated On : November 13, 2021 / 8:45 PM IST

Varla Ramaiah letter to DGP : ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు టీడీపీ నేత వర్ల రామయ్య బహిరంగ లేఖ రాశారు. డీజీపీ సవాంగ్‌, ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డికి మధ్య జరిగిన రహస్య ఒప్పందం రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలన్నారు. సవాంగ్‌ అధ్యక్షతన పోలీస్‌ శాఖ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అడుగడుగునా పరిధిదాటి వ్యవహరిస్తూ, ప్రజల దృష్టిలో అభాసుపాలు అవుతుందని విమర్శించారు.

పోలీసు శాఖ పరిధిదాటి ఎన్నో దఫాలు హైకోర్టుతో కూడా చీవాట్లు తిందని గుర్తు చేశారు. ఎన్నికల సమయాల్లో, పలువురు పోలీసులు తామే అధికార పార్టీ అభ్యర్థులు అన్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల పరిస్థితి, వారు వ్యవహరిస్తున్న తీరు, అటు న్యాయస్థానంలోనూ.. ఇటు ఎన్నికల నిర్వహణ కమిషనర్‌తో చీవాట్లు తింటున్నారని ఎద్దేవా చేశారు.

YS Sharmila : ఆఖరి గింజ వరకు కొనాలి..లేదంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా : వైఎస్ షర్మిల

పోలీసు శాఖను ఈ విధంగా నిర్వీర్యం చేసి ఎందుకు అభాసుపాలు చేస్తున్నారని సవాంగ్‌ ను ప్రశ్నించారు. ‘ఇప్పటికైనా మీరు ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌ అధికారిగా మీ బాధ్యతలను గుర్తెరిగి చట్టప్రకారం నడుచుకోండి’ అని హితవుపలికారు.