దేశానికే హీరో : మండలి చైర్మన్ పై టీడీపీ ప్రశంసల వర్షం
కీలక బిల్లులను(వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు) సెలక్ట్ కమిటీకి పంపిస్తూ మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు టీడీపీ నేతలు. చైర్మన్‌కు ఆ విచక్షణాధికారం

కీలక బిల్లులను(వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు) సెలక్ట్ కమిటీకి పంపిస్తూ మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు టీడీపీ నేతలు. చైర్మన్‌కు ఆ విచక్షణాధికారం
కీలక బిల్లులను(వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు) సెలక్ట్ కమిటీకి పంపిస్తూ మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు టీడీపీ నేతలు. చైర్మన్‌కు ఆ విచక్షణాధికారం ఉంటుందన్నారు. ఈ విషయంలో చైర్మన్ నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు. ఏపీ రాజకీయ చరిత్రలోనే ఇది గుడ్ డేగా అభివర్ణించారు. మండలి చైర్మన్.. దేశానికే ఒకో హీరోగా అభివర్ణించారు. మండలిలో బిల్లులు ఆమోదం పొందకుండా టీడీపీ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. బిల్లుల్ని సెలక్ట్ కమిటీకి పంపించాలన్న టీడీపీ నేతల ప్రతిపాదనకు చైర్మన్ పచ్చజెండా ఊపారు. దీంతో టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. చైర్మన్‌కు విచక్షణాధికారం ఉంటుందని చెప్పారు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. రూల్ 154 ప్రకారమే చైర్మన్ నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు.
ఇక ఏపీ రాజకీయ చరిత్రలోనే బుధవారాన్ని(జనవరి 22,2020) గుడ్ డేగా అభివర్ణించారు మరో టీడీపీ నేత బుద్దా వెంకన్న. అసెంబ్లీలో బలం ఉందని విర్రవీగిన వైసీపీకి ఇది చెంపపెట్టు అన్నారు. రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకున్నారో.. అదే విధమైన నిర్ణయం వెలువడిందన్నారు బుద్దా వెంకన్న. మరోవైపు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానన్న బాధ మొదటిసారి కలిగిందన్నారు టీడీపీ నేత అశోక్ బాబు. అసెంబ్లీలో వాళ్ల బలం వాళ్లు వాడుకుంటే.. మండలిలో తమ బలాన్ని తాము వాడుకున్నామన్నారు.
బలం.. రూల్స్ కన్నా గొప్పది కాదన్నారు. చైర్మన్ ప్రజాస్వామ్యాన్ని బతికించారని తెలిపారు. మొత్తానికి మండలిలో టీడీపీ తన పంతం నెగ్గించుకోవడంపై ఫుల్ జోష్‌లో ఉన్నారు తెలుగు తమ్ముళ్లు. ఇదే ఊపుతో ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పడేసే వ్యూహాలను రచించేందుకు సిద్ధమవుతున్నారు.
* చైర్మన్ నిర్ణయంపై టీడీపీ నేతల్లో ఆనందం
* ఏపీ రాజకీయ చరిత్రలో గుడ్ డే అంటూ అభివర్ణన
* రూల్ 154 ప్రకారమే చైర్మన్ నిర్ణయం తీసుకున్నారని వివరణ
* చైర్మన్ ప్రజాస్వామ్యాన్ని బతికించారని వ్యాఖ్యలు
* పంతం నెగ్గడంతో ఫుల్ జోష్‌లో తెలుగు తమ్ముళ్లు
* కీలక బిల్లులు(వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు) సెలక్ట్ కమిటీకి పంపిన మండలి చైర్మన్ షరీఫ్
* విచక్షణాధికారంతో మండలి చైర్మన్ నిర్ణయం