Balakrishna : అసెంబ్లీలో విజిల్ వేసిన బాలకృష్ణ .. మండిపడ్డ మంత్రి అంబటి

గురువారం అసెంబ్లీలో బాలకృష్ణ మీసం తిప్పారనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈక్రమంలో రెండో రోజు కూడా బాలకృష్ణ సభలో విజిల్ వేసి మరోసారి వివాదంగా మారారు. బాలకృష్ణ విజిల్ వేసిన చర్యపై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.

Balakrishna : అసెంబ్లీలో విజిల్ వేసిన బాలకృష్ణ .. మండిపడ్డ మంత్రి అంబటి

Balakrishna whistle in assembly

Balakrishna whistle in assembly : ఆంధ్రప్రదేశ్  అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా గందరగోళంగా మారాయి. టీడీపీ సభ్యులు  చంద్రబాబు అరెస్టుపై (Chandrababu Arrest) చర్చించాలని డిమాండ్ చేస్తు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. సభలో మరోసారి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమయ్యాక కూడా అదే పరిస్థితులు రిపీట్ అయ్యాయి. ఈక్రమంలో టీడీపీ నేత, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సభలో ఈల వేశారు. ఈల వేస్తు తన నిరసనను తెలిపారు. విజిల్ తెచ్చుకుని ఉన్న చోటే నిలబడి కంటిన్యూగా విజిల్ వేశారు.

గురువారం సభలో బాలకృష్ణ మీసం తిప్పారనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈక్రమంలో రెండో రోజు కూడా బాలకృష్ణ సభలో విజిల్ వేసిన దృశ్యాలు వైరల్ గా మారాయి. బాలకృష్ణ విజిల్ వేసిన చర్యలపై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టుపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తారు..చర్చకు సిద్ధమంటే పారిపోతారు అంటూ సెటైర్లు వేశారు. ఇది టీడీపీ ఆఫీసుకు కాదు..గౌరవమైన సభ..ఇక్కడ ఈలలు వేయటం సరికాదు  అంటూ మండిపడ్డారు. ఇలా అసెంబ్లీలో అంబటి వర్సెస్ బాలకృష్ణగా మారింది.

Also Read : ఆ అపవాదు చెరుపుకోండి అంటూ బాలకృష్ణకు అంబటి సూచనలు

చంద్రబాబు అరెస్ట్ అంశంపై శాసనసభ అట్టుడుకుతోంది. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని స్కామ్ అనేదే లేదని..అవినీతి జరగిందనే ఆరోపణలతో అరెస్ట్ చేసి అక్రమంగా జైల్లో పెట్టారని టీడీపీ విమర్శిస్తోంది. అవినీతి జరిగిందనే ఆరోపణలే తప్ప దానికి సంబంధించి సీఐడీ ఆధారాలు చూపించలేని దుస్థితిలో ఉందని.. ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయటం దుర్మార్గమని అది సీఎం జగన్ కక్ష సాధింపు చర్య అంటూ మండిపడుతున్నారు.

అరెస్ట్ చేసి ఆధారాలు చూపిస్తామని కాలయాపన చేస్తోందని అవినీతి జరిగితే ఆధారాలు చూపించి అరెస్ట్ చేయాలి గానీ కక్ష సాధింపుతోనే చంద్రబాబును జైల్లో ఉంచాలనే కక్షతోనే అరెస్ట్ చేశారని విమర్శిస్తోంది. ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి తరువాత ఆధారాలు సేకరిస్తున్నామని చెప్పటం అత్యంత సిగ్గుచేటైన విషయం అని టీడీపీ మండిపడుతోంది. కాగా నిన్న సభలో గందరగోళం సృష్టించారని 14మంది టీడీపీ సభ్యుల్ని స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో రెండో రోజు కూడా అచ్చెన్నాయుడు, అశోక్ లను సమావేశఆలు ముగిసేవరకు సస్పెండ్ చేశారు.