NTR Statue : ఓటమి భయంతోనే వైసీపీ దుశ్చర్యలు- ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసంపై బాలకృష్ణ, లోకేశ్ ఆగ్రహం
అన్నగారిని అవమానించడమంటే తెలుగువారిని అవమానించడమే అన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలో భాగంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.

NTR Statue Demolish
బాపట్ల మండలం భర్తిపూడిలో ఎన్టీఆర్ విగ్రహం కూల్చివేతను తీవ్రంగా ఖండించారు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, నారా లోకేశ్. ఓటమి భయంతోనే అధికార వైసీపీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. తెలుగు ప్రజల గుండెల్లో కొలువైన ఎన్టీఆర్ స్థానాన్ని ఆయన విగ్రహాల కూల్చివేతతో వైసీపీ చెరిపేయలేదన్నారు. 3 నెలల్లో.. కూల్చిన చోటే కూల్చిన వారితోనే ఎన్టీఆర్ విగ్రహం మళ్లీ పెట్టిస్తామన్నారు నారా లోకేశ్.
ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం బాధాకరం అన్నారు బాలకృష్ణ. విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలో భాగంగానే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసాన్ని బాలయ్య ఖండించారు. అర్ధరాత్రి సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడటం పిరికి పందచర్యగా అభివర్ణించారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీఆర్ విగ్రహంపై ఈ అమానుష ఘటన తీవ్రంగా బాధించిందన్నారు.
Also Read : గాంధీ భవన్ ముందు టీడీపీ సన్నాసుల గెంతులు: కొడాలి నాని
అన్నగారిని అవమానించడమంటే తెలుగువారిని అవమానించడమే అన్నారు. రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా మహనీయులను అవమానించే చర్యలు పరిపాటిగా మారాయని బాలకృష్ణ ఆరోపించారు. విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలో భాగంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. మరోసారి విధ్వంసక ఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు బాలకృష్ణ.