Nara Lokesh Comments : చిరు, బాలయ్య సినిమాల రిలీజ్ పై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు
చిరు, బాలయ్య సినిమాల రిలీజ్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతికి వినోదం పంచేందుకు వీరసింహారెడ్డిగా వస్తున్న బాలయ్యకు, వాల్తేరు వీరయ్యగా వస్తున్న మెగాస్టార్ చిరంజీవికి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.

LOKESH
Nara Lokesh Comments : చిరు, బాలయ్య సినిమాల రిలీజ్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతికి వినోదం పంచేందుకు వీరసింహారెడ్డిగా వస్తున్న బాలయ్యకు, వాల్తేరు వీరయ్యగా వస్తున్న మెగాస్టార్ చిరంజీవికి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రెండు సినిమాలను కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల్లో ఒకడిగా చూసేందుకు తహతహలాడుతున్నాను అంటూ ట్వీట్ చేశారు. అధికారి పార్టీ మరో కుట్రకు తెరతీసిందన్నారు. హీరోల అభిమానుల పేరుతో కులాలపై విషం చిమ్మే కుట్ర మొదలైందన్నారు.
ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు విడుదలవుతున్న సమయంలో హీరోల పేరు, కులాల పేరుతో ఫేక్ పోస్టులు పెడుతున్నారని తెలిపారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చ గొట్టేందుకు అధికార పార్టీ యత్నిస్తోందన్నారు. విష ప్రచారం చేసి కుల, మత, ప్రాంతాల మధ్య విద్వేశాలు రెచ్చగొట్టే వారి ట్రాప్ లో ఎవరూ పడొద్దన్నారు. మరోవైపు హీరోల పేరుతో కులాల పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టి విద్వేశాలు రెచ్చ గొట్టే ప్రయత్నం జరుగుతోందంటూ అధికారి వైసీపీపై విమర్శలు చేశారు.
Lokesh : పెద్ద వివాదంగా మారిన ఫారిన్ ఫోటోపై స్పందించిన లోకేష్.. ఎన్ని ట్రోల్స్ చేసినా..
మనమంతా ఒక్కటేనని, కులం, మతం, ప్రాతం ఏవీ మనల్ని విడదీయలేవని లోకేష్ అన్నారు. కుల కలహాలకు వైసీపీ పన్నాగం పన్నుతుందని కామెంట్స్ చేశారు. ఫేక్ అకౌంట్లతో ఫ్యాన్స్ ను రెచ్చగొట్టేందుకు వైసీపీ కుట్ర చేస్తోందన్నారు. అభిమానుల పేరుతో కులాలపై విషం చిమ్మే కుట్ర మొదలైందని ఆరోపించారు.
మరోవైపు RRR సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం పట్ల ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. RRR సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంపై టీటీడీ అధినేత చంద్రబాబు అభినందించారు. ‘నాటు నాటు’ సాంగ్ కు అవార్డు రావడంతో కీరవాణి, రాజమౌళి, RRR టీమ్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అయితే జూ.ఎన్టీఆర్ పేరును ట్వీట్ లో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. అటు చంద్రబాబు ట్వీట్ కు జూ.ఎన్టీఆర్ స్పందించారు. ‘థాంక్యూ సోమచ్ మామయ్య’ అంటూ అప్యాయంగా బదులిచ్చారు.
Nara Lokesh: చంద్రబాబు రాముడైతే.. జగన్ రాక్షసుడు: నారా లోకేష్
అయితే చంద్రబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే కీరవాణి, రాజమౌళి, RRR టీమ్ ను మెన్షన్ చేస్తూ చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే జూ.ఎన్టీఆర్ పేరును ప్రస్తావించకపోవడంతో ఇదొక హాట్ టాపిక్ అయిందని చెప్పవచ్చు. మరోవైపు ఎన్టీఆర్ ను ట్యాగ్ చేస్తూ ఏపీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. థాంక్యూ సర్ అంటూ సీఎం జగన్ కు ఎన్టీఆర్ రిప్లై ఇచ్చారు.