టీడీపీ మేనిఫెస్టో విడుదల
సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు నినాదంతో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే దేశవ్యాప్తంగా అమలు అవుతున్నాయని, ఎన్టీఆర్ స్పూర్తితో అధికారంలోకి వచ్చాక చెప్పినవాటి కంటే ఎక్కువ చేశామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు నినాదంతో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే దేశవ్యాప్తంగా అమలు అవుతున్నాయని, ఎన్టీఆర్ స్పూర్తితో అధికారంలోకి వచ్చాక చెప్పినవాటి కంటే ఎక్కువ చేశామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు నినాదంతో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే దేశవ్యాప్తంగా అమలు అవుతున్నాయని, ఎన్టీఆర్ స్పూర్తితో అధికారంలోకి వచ్చాక చెప్పినవాటి కంటే ఎక్కువ చేశామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. కొందరు ఇవి చేస్తాం.. అవి చేస్తామని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కనీస అవగాహన లేకుండా ఎవరో చెప్పింది మేనిఫెస్టోలో పెట్టేశారని విమర్శించారు.
Read Also : వైసీపీ హామీ : జగన్ వస్తే కొత్త జిల్లాలు ఇవే
పేదరికం లేని ఆరోగ్యకర, ఆనందదాయక సమాజం ఏర్పాటే తమ లక్ష్యమని, 2004-2014 మధ్య కాలం రాష్ట్రానికి చీకటి దశాబ్ధం అని, అప్పడు రైతులు, మహిళలు, యువత అందరూ ఇబ్బంది పడ్డారని గుర్తు చేశారు. అనుభవం లేనివాళ్ల మాటలకు విలువలేదని అన్నారు.
నదుల అనుసంధానం, ప్రాజెక్టులు, నీటి హక్కుల గురించి మేనిఫెస్టోలో పెట్టలేని వ్యక్తులు వట్టి మాటలు చెబతున్నారని అన్నారు. నదులు అనుసంధానం చేయడం వల్లే పులివెందులకు కూడా నీళ్లు ఇచ్చామని అన్నారు. అలాగే రాయలసీమ స్టీల్ ప్లాంట్ తెలుగుదేశం తెస్తుంటే.. బ్రహ్మిణీ స్టీల్స్ తీసుకుని వస్తానని జగన్ చెబుతున్నారిని అన్నారు.
కొందరు అమరావతి గ్రాఫిక్స్ అంటున్నారని, అది పూర్తయితే మీ కడుపు మండుతుందని, అందుకే మేనిఫెస్టోలో కూడా పెట్టలేకపోయారని, ఊరికి 10మందిని పెడతామని అంటున్నారని, వాళ్లను పెట్టి పెన్షన్లు, సంక్షేమ పథకాలు నొక్కేస్తారా? అంటూ వైసీపీని ఉద్దేశించి విమర్శించారు.
తెలుగుదేశం మేనిఫెస్టోలోని అంశాలు:
-అన్నదాతా సుఖీభవ పథకం ఐదేళ్లు అమలు
-రైతులందరికీ ఉచితంగా పంటల బీమా పథకం
-రైతులకు పగటిపూట 12 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా
-రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు. వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరల కోసం ధరల స్థిరీకరణ నిధి.
-రైతులకు లాభసాటి ధరలు లభించేలా వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థల బలోపేతం
-ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రజలకు అవసరమైన తాజా కూరగాయలు, పండ్లు సరఫరాకు ప్రత్యేక చర్యలు
-రైతు ఉత్పత్తులకు నాణ్యమైన ధరలు లభించేలా చర్యలు
-గిరిజన రైతులకు ఐటీడీఏ ద్వారా ఉచితంగా విత్తనాలు, పెట్టుబడి రాయితీలు
-40 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఉద్యాన పంటలను కోటి ఎకరాలకు విస్తరింపు
-మరో 50 లక్షల ఎకరాల్లో డ్రిప్, స్పింక్లర్ వ్యవస్థల ఏర్పాటు
-కోల్డ్ స్టోరేజీ యూనిట్లు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు
-యువతకు ఏటా ఉద్యోగాల భర్తీ చేస్తాం.
-నిరుద్యోగ భృతిని రూ.2వేల నుంచి రూ.3వేలకు పెంచుతాం. ఇంటర్ పాసైతే చాలు నిరుద్యోగ భృతి ఇస్తాం.
-ఇంటర్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తాం.
Read Also : వైఎస్ఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల