Srisailam : శ్రీశైలంలో ఆర్టీసీ బస్సుకి తప్పిన పెను ప్రమాదం
Srisailam : బస్సు టైర్ గుంతలో పడి బస్సు ఆగడంతో పెను ప్రమాదం తప్పింది.

Srisailam (Photo : Google)
Srisailam – RTC Bus : నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఆర్టీసీ బస్సుకి పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. డ్యాం దగ్గర తెలంగాణ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి గుంతలో ఇరుక్కుంది. హైదరాబాద్ డిపోకి చెందిన బస్సు ఆర్టీసీ బస్సు శ్రీశైలం నుండి హైదరాబాద్ వెళ్తోంది. జలాశయం దగ్గర మలుపు తిప్పుతూ గుంతలో పడి రోడ్డుకు ఆనుకుంది.
బస్సు టైర్ గుంతలో పడి బస్సు ఆగడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో బస్సులో 30మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడ్డారు. కాగా, బస్సు టైరు గుంతలో పడటంతో సుమారు 2 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రంగంలోకి దిగిన అధికారులు ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో పడ్డారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు, అధికారులు అంతా ఊపిరిపీల్చుకున్నారు.