New Pamban Bridge: పంబన్ బ్రిడ్జి నిర్మాణంలో ఇంజనీరింగ్ ఇంఛార్జిగా తెలుగు కుర్రాడు.. నాలుగేళ్లు పాటు శ్రమించి..

అధునాతన సాంకేతికతతో నిర్మించిన పంబన్ బ్రిడ్జి నిర్మాణంలో సీనియర్ సెక్షన్ ఇంజినీర్ హోదాలో ఇన్ చార్జిగా నాలుగేళ్లపాటు చక్రధర్ పనిచేశాడు.

New Pamban Bridge: పంబన్ బ్రిడ్జి నిర్మాణంలో ఇంజనీరింగ్ ఇంఛార్జిగా తెలుగు కుర్రాడు.. నాలుగేళ్లు పాటు శ్రమించి..

Telugu Engineer Venkata Chakradhar

Updated On : April 6, 2025 / 10:38 AM IST

Telugu Engineer Venkata Chakradhar: తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్ల నిధులతో అధునాతన సాంకేతికతతో నిర్మించిన పంబన్ బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ జాతికి అంకితం చేయనున్నారు. ఈ న్యూ పంబన్ బ్రిడ్జీ భారతదేశ ఇంజనీరింగ్ నైపుణ్యానికి, విజనరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌కు నిదర్శనంగా నిలుస్తోంది. మనదేశపు తొలి వర్టికల్‌ బ్రిడ్జి ఇది. న్యూ పంబన్ వంతెనను రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నవరత్న పీఎస్‌యూ రైల్ వికాస్ నిగం లిమిటెడ్ (ఆర్‌వీఎన్‌ఎల్) నిర్మించింది. 2020లో పనులు ప్రారంభించింది. ఇప్పుడు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.

Also Read: Waqf Amendment Bill : వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం..

పంబన్ బ్రిడ్జిపై 600 మీటర్ల పరిధిలో భారీ పరిమాణంలో వర్టికల్‌ లిఫ్ట్‌ ఉంది. దీని పనులు పూర్తికావడానికే దాదాపు ఐదు నెలలు పట్టింది. దాని బరువు 660 టన్నులు. పొడువు 72.5 మీటర్లు. ఈ పంబన్ బ్రిడ్జి మొత్తం పొడవు 2.07 కిలోమీటర్లు. బ్రిడ్జి కింద నుంచి ఓడలు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా రాకపోకలు సాగించొచ్చు. అద్భుత సాంకేతికతతో రూపొందించిన ఈ బ్రిడ్జి నిర్మాణంలో తెలుగు కుర్రాడి పాత్ర కూడా ఉంది.

Also Read: Landmine Sniffing Rat : ఎలుకా మజాకా.. ల్యాండ్ మైన్స్ కనిపెట్టడంలో మూషికం వరల్డ్ రికార్డ్, ఏకంగా 109 మందుపాతరలను గుర్తించింది..

పంబన్ బ్రిడ్జి నిర్మాణంలో ఇంజినీరింగ్ ఇన్ ఛార్జిగా ఏపీలోని విజయనగరం జిల్లా గుర్ల మండలం భూపాలపురం గ్రామానికి చెందిన 28ఏళ్ల యువ ఇంజినీర్ నడుపూరు వెంకటచక్రధర్ కీలక పాత్ర పోషించాడు. చక్రధర్ తల్లిదండ్రులు పైడి రాజు, శ్రీదేవి. ఇద్దరూ ఉపాధ్యాయులే. చక్రధర్ కు చిన్నతనం నుంచే బ్రిడ్జిలపై ఆసక్తితో బీటెక్ లో సివిల్ ఇంజినీరింగ్ ఎంచుకున్నాడు. తరువాత ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్) కోసం శిక్షణ తీసుకునే సమయంలో ఆర్ఆర్ బీ నోటిఫికేషన్ రావడంతో అందులో ఎంపికై రైల్వేలో బ్రిడ్జి విభాగం ఆప్షన్ ను ఎంచుకొని ఉద్యోగంలో చేరాడు. తొలి పోస్టింగ్ చెన్నైలో వచ్చింది. పనితీరు ఆధారంగా త్వరగానే సీనియర్ ఇంజినీర్ గా ఉద్యోగోన్నతి లభించింది. అదే సమయంలో రామేశ్వరం ద్వీపాన్ని ప్రధాన భూభాగంతో అనుసంధానించేలా సముద్రపై నిర్మించిన పాత పంబన్ వంతెన శిథిలావస్థకు చేరడంతో దాని స్థానంలో కొత్తది కట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

 

అధునాతన సాంకేతికతతో నిర్మించిన పంబన్ బ్రిడ్జి నిర్మాణంలో సీనియర్ సెక్షన్ ఇంజినీర్ హోదాలో ఇన్ చార్జిగా నాలుగేళ్లపాటు చక్రధర్ పనిచేశాడు. రైల్వేలో వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జి దేశంలో ఇదే మొదటిది. దీని సాంకేతికతను స్పెయిన్ నుంచి తీసుకోగా.. మిగతా సామాగ్రి అంతా దేశీయంగా సమకూర్చుకున్నదే. వంతెన పనులు మొదలు ట్రయల్ రన్ వరకు ప్రతి దశలోనూ పూర్తిగా లీనమై పనిచేశామని చక్రధర్ తెలిపాడు.