Afghanistan : అఫ్ఘాన్‌‌లో చిక్కుకున్న తెలుగు వారు, స్పందించని తెలుగు రాష్ట్రాలు

అఫ్ఘాన్ దేశంలో తెలుగు వాసులు చిక్కుకపోవడంతో..వారి వారి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు తెలుగు రాష్ట్రాలు స్పందించడం లేదు.

Afghanistan : అఫ్ఘాన్‌‌లో చిక్కుకున్న తెలుగు వారు, స్పందించని తెలుగు రాష్ట్రాలు

Telugu States

Updated On : August 19, 2021 / 1:13 PM IST

Telugu People Stuck In Afghanistan : అఫ్ఘాన్ ను తాలిబన్లు వశం చేసుకోవడంతో పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చుట్టుపక్కల దేశాలు..ఉగ్రవాదం ఎక్కడ వ్యాపిస్తుందోనని టెన్షన్ పడుతున్నాయి. అఫ్ఘాన్ దేశం నుంచి వెళ్లిపోయేందుకు చాలా మంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద చలించిపోయే దృశ్యాలు కనిపిస్తున్నాయి. విమానంలోకి ఎక్కేందుకు చాలా మంది పోటీ పడుతున్నారు. విమానంపై నుంచి ప్రయాణిస్తున్నారు.

Read More : Fennel seeds : భోజనం పూర్తయ్యాక సోంపు గింజలు తింటే మంచిదా!..

ఇదిలా ఉంటే..ఆ దేశంలో చాలా మంది చిక్కుకపోయారు. వీరిని కాపాడేందుకు పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రత్యేక విమానాలు కేటాయించి వారిని తమ దేశాలకు తీసుకొస్తున్నారు. అయితే..అఫ్ఘాన్ దేశంలో తెలుగు వాసులు చిక్కుకపోవడంతో..వారి వారి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేయాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. అయినా…ఇంతవరకు తెలుగు రాష్ట్రాలు స్పందించడం లేదు.

Read More : Afghan Dogs : ఛత్తీస్ గఢ్ అడవుల్లో అఫ్గాన్ యుద్ధ జాగిలాలు

అసలు ఎంతమంది తెలుగు వారు చిక్కుకున్నారు ? వారి యోగక్షేమాలు..తదితర సమాచారం తేలడం లేదు. వెనక్కి తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలపై స్పష్టత కానరావడం లేదు. తమ రాష్ట్రాల ప్రజలను వెనక్కి తీసుకొచ్చేందుకు ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటున్నాయి. చిక్కుకున్న వారి జాబితాలను రూపొందించి..అందచేయాలని అధికార యంత్రాంగాన్ని బెంగాల్ ప్రభుత్వం ఆదేశించింది. అఫ్ఘాన్ లో 200 మంది బెంగాల్ పౌరులు చిక్కుకున్నారని సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు.

Read More : Job Vacancy : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

తమ రాష్ట్ర పౌరులను వెనక్కి తీసుకురావాలని కేంద్రానికి బెంగాల్ ప్రభుత్వం లేఖ రాసింది. అదే విధంగా కర్నాటక ప్రభుత్వం ఏకంగా ఓ సీనియర్ పోలీసు అధికారిని నోడల్ అధికారిగా నియమించడం గమనార్హం. తమ రాష్ట్రాల పౌరుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కనీసం ఎంత మంది చిక్కుకున్నారో వెల్లడించలేని పరిస్థితిల్లో తెలుగు రాష్ట్రాలున్నాయి. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలు త్వరగా నిర్ణయం తీసుకోవాలనే సూచనలు చేస్తున్నారు. మరి చిక్కుకున్న పౌరులను వెనక్కి తీసుకొచ్చేందుకు తెలుగు రాష్ట్రాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో చూడాలి.