యావజ్జీవ శిక్ష పడిన మహిళా ఖైదీలు ముందస్తుగా విడుదల…ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

women prisoners early release : రాజ్యాంగ దినోత్సవం రోజున మహిళా ఖైదీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యావజ్జీవ శిక్ష పడిన మహిళా ఖైదీలు ముందస్తుగా విడుదల చేయనుంది. 53 మంది మహిళా ఖైదీల విడుదలకు గురువారం (నవంబర్ 26, 2020) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాజమండ్రి మహిళా జైలు నుంచి 19 మంది, కడప నుంచి 27 మంది, నెల్లూరు నుంచి 5, విశాఖ నుంచి ఇద్దరు మహిళా ఖైదీల విడుదలకు రంగం సిద్ధమైంది. అయితే ఖైదీల విడుదలకు ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది.
రూ.50 వేలు పూచీకత్తు, బాండు ఇవ్వాలని ఆదేశించింది. శిక్షా కాలం ముగిసేవరకు ప్రతి 3 నెలలకోసారి పీఎస్ లో హాజరుకావాలని తెలిపింది. మళ్లీ నేరాలకు పాల్పడితే ముందస్తు విడుదల రద్దు చేస్తామని స్పష్టం చేసింది.