AP High Court : పీఆర్సీ జీవోలను సవాల్ చేస్తూ పిటిషన్.. విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు

విభజన చట్టం సెక్షన్ 78కి విరుద్ధంగా ఉన్న జీవోను వెంటనే రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కేవీ.కృష్ణయ్య కోరారు. ప్రభుత్వం విడుదల చేసిన వేతన సవరణ జీవో నిరాశపర్చిందని అన్నారు.

AP High Court : పీఆర్సీ జీవోలను సవాల్ చేస్తూ పిటిషన్.. విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు

Ap High Court

Updated On : January 22, 2022 / 3:26 PM IST

AP High Court accepted petition : పీఆర్సీ జీవోలను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ ను ధర్మాసనం విచారణకు స్వీకరించింది. సోమవారం నుంచి పిటిషన్ పై హైకోర్టు విచారణను చేపట్టనుంది. సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించడంపై నిన్న ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ అధ్యక్షుడు కేవీ.కృష్ణయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. విభజన చట్టం ప్రకారం ఎలాంటి బెనిఫిట్స్ తగ్గకూడదని పిటిషనర్ కోర్టును కోరారు.

విభజన చట్టం సెక్షన్ 78కి విరుద్ధంగా ఉన్న జీవోను వెంటనే రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ప్రభుత్వం విడుదల చేసిన వేతన సవరణ జీవో ఎంతగానో నిరాశపర్చిందని కేవీ.కృష్ణయ్య అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత జీతాలు, జీవితాలు ఎంతో ఉన్నతంగా ఉంటాయనుకున్నామని కానీ, ప్రతీసారి తమకు నిరాశే ఎదురవుతుందన్నారు.

Vinod Kumar Corona : తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కు కరోనా

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె సైరన్ మోగించారు. ఫిబ్రవరి 7 నుంచి సమ్మెకు వెళ్తామని ఏపీ ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పాయి. పీఆర్సీపై ఉద్యమించేందుకు 12 మందితో సాధన సమితి ఏర్పాటు చేసుకున్నారు. ఫిబ్రవరి 3న చలో విజయవాడ కార్యక్రమం, ఫిబ్రవరి 5 నుంచి సహాయ నిరాకరణ చేపట్టాలని ఉద్యోగ సంఘాల నేతలు నిర్ణయించారు. సోమవారం సీఎస్ కు సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. పీఆర్సీ జీవోలను వెంటనే నిలుపుదల చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ నెల 23న అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈనెల 25న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు చేపట్టనున్నారు. 26న అన్ని తాలూకా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రాహానికి మొమొరాండాలు సమర్పించాలని నిర్ణయించారు. ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు నాలుగు రోజులపాటు జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని ఉద్యోగ సంఘాల నిర్ణయించాయి.

APSRTC Strike : ఏపీలో ఆర్టీసీ సమ్మె.. నిలిచిపోనున్న బస్సులు!

మరోవైపు పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపడానికి ఏపీ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో సభ్యులుగా మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ ఉన్నారు. పీఆర్సీపై జరుగుతున్న వివాదానికి తెరదించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. కేబినెట్ సమావేశంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్ సుముఖంగా ఉన్నారు.