APSRTC Strike : ఏపీలో ఆర్టీసీ సమ్మె.. నిలిచిపోనున్న బస్సులు!

సమ్మె ఆర్టీసీపై ప్రభావం చూపింది. ఫిబ్రవరి 07వ తేదీ నుంచి జరుగనున్న సమ్మెకు ఆర్టీసీ యూనియన్ల సంఘాలు మద్దతు తెలపడం గమనార్హం. పీఆర్సీ సాధన సమితికి...

APSRTC Strike : ఏపీలో ఆర్టీసీ సమ్మె.. నిలిచిపోనున్న బస్సులు!

Apsrtc

RTC Strike In Andhra Pradesh : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మై సైరన్ మ్రోగించారు. వీరు చేపట్టే సమ్మె ఆర్టీసీపై ప్రభావం చూపింది. ఫిబ్రవరి 07వ తేదీ నుంచి జరుగనున్న సమ్మెకు ఆర్టీసీ యూనియన్ల సంఘాలు మద్దతు తెలపడం గమనార్హం. పీఆర్సీ సాధన సమితికి ఆర్టీసీ ఉద్యోగులు మద్దతు తెలిపారు. దీంతో ఫిబ్రవరి 07వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మెలోకి వెళ్లనున్నారు. పెద్ద సంఘాలు మద్దతు తెలపడంతో…ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నాయి. 2022, జనవరి 22వ తేదీ ఆదివారం రాష్ట్ర సీఎస్ ను ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలు కలిసి సమ్మె నోటీసు ఇవ్వనున్నారు.

Read More : Puneeth Rajkumar : నెలరోజుల పాటు ఫ్రీగా పునీత్ రాజ్ కుమార్ సినిమాలు..

ఈ క్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులతో 10tv మాట్లాడింది. మా జీతాలు తగ్గించుకోవాలంటే..కుదరదని, ఆర్టీసీ ఎన్ని వేల కోట్ల రూపాయలు నష్టాల్లో ఉన్నా గతంలో ప్రతి నెలా ఒకటి తేదీనే వేతానాలు వచ్చేవన్నారు. ప్రస్తుతం రెండు నుంచి ఏడు…తొమ్మిదో తేదీ వరకు జీతాలు పడుతున్నాయని తెలిపారు. అయినా..ఆ విషయం..ఇక్కడ ఉత్పన్నం కాదన్నారు. 8 శాతం హెచ్ఆర్ఏ లో పెట్టిన తర్వాత…జీతాలు తగ్గవని ప్రభుత్వం ఎలా చెబుతుందో అర్థం కావడం లేదన్నారు. ఇంటి అద్దెలో..నాలుగు వేల రూపాయలు తాను కోల్పోవడం జరుగుతోందన్నారు.

Read More : India-Germany: భారత పర్యటనకు వచ్చి చైనా పై నిప్పులు చెరిగిన జర్మన్ అధికారి

ఆర్టీసీ ఆదాయాన్ని దీనితో ముడిపెట్టలేమని, ఉద్యోగుల ఆర్థికపరమైన అంశాలను ప్రభుత్వం పునర్ ఆలోచించాలని సూచించారు. ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని..కూలీ చేసి కూలీ డబ్బులు అడుగుతున్నామన్నారు. ఓ వైపు కరోనాతో ఆర్టీసీ అతలాకుతమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో…ఆర్టీసీ మరోసారి సమ్మెలోకి వెళితే..మరింత నష్టాల్లోకి వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్ళకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.