Boat Trip : పాపికొండల్లో బోటు యాత్ర

బోటులో విహరిస్తూ పాపికొండల అందాలను తిలకించవచ్చు. నవంబర్ 7 వ తేదీ నుంచి పాపికొండల్లో బోటు యాత్ర ప్రారంభం కానున్నట్లు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రకటించారు.

Boat Trip : పాపికొండల్లో బోటు యాత్ర

Papikondalu

Updated On : October 28, 2021 / 8:32 AM IST

boat trip in Papikondalu : బోటులో విహరిస్తూ పాపికొండల అందాలను తిలకించవచ్చు. నవంబర్ 7 వ తేదీ నుంచి పాపికొండల్లో బోటు యాత్ర ప్రారంభం కానున్నట్లు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రకటించారు. నదిలో 28 మీటర్ల మట్టం వరకు నీరు ఉన్నప్పుడు మాత్రమే పర్యాటక బోట్లను అనుమతిస్తున్నారని, దీన్ని 30 మీటర్ల వరకు పెంచాలని నీటిపారుదల శాఖను కోరనున్నట్లు తెలిపారు.

బుధవారం సచివాలయంలో బోటు నిర్వహకులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గత ఏడాది గోదావరిలో బోటు ప్రమాదం తరహా ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. గోదావరి, కృష్ణా నదుల్లో పర్యాటక బోట్ల నిర్వహణకు 9 చోట్ల కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

AP Cabinet : ఏపీ కేబినెట్ భేటీ…పలు కీలక అంశాలపై చర్చ

రాజమండ్రి నుంచి పాపికొండల వరకు పర్యాటక బోటులో టిక్కెట్ ధర రూ.1,250 గా నిర్ణయించామని పేర్కొన్నారు. పశ్చిమగోదావరి నుంచి పాపికొండలకు బోటు కార్యకలాపాలు నిర్వహించే విషయాన్ని పరిశీలించాలని బోటు నిర్వహకులు కోరారు. పర్యాటక బోటు కార్యకలాపాల్లో కార్పొరేట్ సంస్థలు ప్రవేశించి తమ జీవనోపాధి దెబ్బతినకుండా చూడాలని విన్నవించుకుంటున్నారు.