Janasena Pawan Kalyan : దేశానికి మూడో ప్రత్యామ్నాయం ఉండాలి : పవన్ కళ్యాణ్

దేశానికి మూడో ప్రత్యామ్నాయం ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీలో కూడా మూడో ప్రత్యామ్నాయం అవసరమని అభిప్రాయపడ్డారు. తిరుపతిలో నిర్వహించిన జనసేన జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్..ప్రజాసమస్యలపై వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీని తీసేయకుండా ఉండి ఉంటే ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయం ఉండేదన్నారు.

Janasena Pawan Kalyan : దేశానికి మూడో ప్రత్యామ్నాయం ఉండాలి : పవన్ కళ్యాణ్

janasena Pawan Kalyan

Updated On : August 21, 2022 / 6:25 PM IST

Janasena Pawan Kalyan : దేశానికి మూడో ప్రత్యామ్నాయం ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీలో కూడా మూడో ప్రత్యామ్నాయం అవసరమని అభిప్రాయపడ్డారు. తిరుపతిలో నిర్వహించిన జనసేన జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్..ప్రజాసమస్యలపై వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీని తీసేయకుండా ఉండి ఉంటే ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయం ఉండేదన్నారు. సమాజంలో గొప్ప మార్పు ఆశించి ప్రజారాజ్యం స్థాపించామని తెలిపారు.

కుట్రలు, కుతంత్రాలతో ప్రజారాజ్యం పార్టీని లేకుండా చేశారని మండిపడ్డారు. గతంలో జరిగిన తప్పు మళ్లీ జరగొద్దనే టీడీపీకి సపోర్టు చేశానని తెలిపారు. వైసీపీ, టీడీపీకి కొమ్ముకాసేందుకు తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. కన్ స్ట్రక్టివ్ పాలిటిక్స్ కు సపోర్టు చేస్తానని చెప్పారు. మునుగోడులో పోటీ చేయాలని జన సైనికులు చెప్పారు..కానీ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ వద్దనే పోటీ చేయడం లేదన్నారు. ‘మేం విడిగా పోటీ చేస్తే మీకు ఓకేనా’ అని అన్నారు.

Pawan Kalyan Janavani : ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని గెలవనివ్వను.. జ్వరంతోనే జనవాణి నిర్వహించిన పవన్ కళ్యాణ్

విధ్వంస పాలన సాగుతున్నప్పుడు ఇతర పార్టీలతో కూడా కలుస్తామని చెప్పారు. ఏపీ భవిష్యత్ కోసం ఏదైనా చేస్తానని తెలిపారు. మార్పు కోసం ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి పేరు పలికేందుకు కూడా తనకు ఇష్టం లేదన్నారు. తనను టీడీపీ మనిషి అని అందరూ విమర్శిస్తూ ఉంటారని పేర్కొన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టడానికి రాలేదని స్పష్టం చేశారు.