Pawan Kalyan Janavani : ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని గెలవనివ్వను.. జ్వరంతోనే జనవాణి నిర్వహించిన పవన్ కళ్యాణ్

వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారని పవన్ ఆరోపించారు. తన పార్టీకి చెందిన ఎస్సీ మిత్రులతో కలిసి త్వరలోనే తాను తాడేపల్లికి వస్తానని, రోడ్డుపై బైఠాయిస్తానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Pawan Kalyan Janavani : ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని గెలవనివ్వను.. జ్వరంతోనే జనవాణి నిర్వహించిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan Janavani : వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని పవన్ ఆరోపించారు. తన పార్టీకి చెందిన ఎస్సీ మిత్రులతో కలిసి త్వరలోనే తాను తాడేపల్లికి వస్తానని, రోడ్డుపై బైఠాయిస్తానని హెచ్చరించారు పవన్. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలను దుర్వినియోగం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్. అమాయకుడైన దివ్యాంగుడిపై పెట్టిన ఎస్సీ అట్రాసిటీ కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

 

చట్టాలను దుర్వినియోగం చేస్తే ఊరుకునేది లేదన్న పవన్..

ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ఫిర్యాదుల స్వీక‌ర‌ణ, వాటి ప‌రిష్కారం కోసం కృషి చేసే దిశ‌గా జనసేనాని పవన్.. జ‌న‌వాణి కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆదివారం తిరుప‌తిలో జనవాణి చేప‌ట్టారు పవన్. తిరుప‌తి ప‌రిధిలోని రామానుజ‌ప‌ల్లి జేఆర్ఆర్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో రాయలసీమ జిల్లాల జనవాణి కార్య‌క్ర‌మానికి జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ హాజ‌ర‌య్యారు. రైతులు, ప్రజలు దీనికి భారీగా తరలివచ్చారు. కాగా, పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరంతో బాధపడుతూనే జనం సమస్యలు విన్నారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల నుంచి ఫిర్యాదులు స్వీక‌రించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌… రాష్ట్ర ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక పంచాయ‌తీల‌కు నిధుల విడుద‌ల ఆగిపోయింద‌న్నారు. డ‌బ్బు, అధికారం మీ వ‌ద్దే ఉంచుకుని ఇత‌రుల‌కు కాస్తంత గౌర‌వం ఇవ్వండ‌ని ఆయ‌న వైసీపీ నేత‌ల‌కు సూచించారు. టీడీపీతో పాటు వైసీపీకి కొమ్ము కాయ‌డానికి తాను సిద్ధంగా లేన‌ని తెలిపారు. ఏదో సామాజిక వ‌ర్గానికి మా పార్టీని అమ్మేయ‌డ‌మే మా ప‌నా? అంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు.

కులాల మ‌ధ్య చిచ్చు పెట్టేందుకు తాను రాలేద‌ని మరోసారి తేల్చి చెప్పారు పవన్. దేశానికి మూడో ప్ర‌త్యామ్నాయం ఉండాల‌న్న ప‌వ‌న్‌… రాష్ట్రంలో మాత్రం మూడో ప్ర‌త్యామ్నాయం త‌ప్ప‌నిస‌రిగా అవ‌స‌ర‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఏపీలో వైసీపీని గెలవనివ్వను అని పవన్ కళ్యాణ్ అన్నారు.

”వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాకుండా అడ్డుకుంటా. ఇందుకోసం ఎన్నికల వ్యూహం సిద్ధం చేశాం. సమయం వస్తుంది. అప్పుడే వ్యూహాన్ని వెల్లడిస్తా. మళ్లీ వైసీపీ ప్రభుత్వం రాకూడదనేది మా విధానం. విధ్వంసక పాలన జరుగుతున్నప్పుడు.. అవసరమైతే శత్రువులు, ప్రత్యర్థి పార్టీలతోనైనా కలుస్తా. రాజకీయాల్లో ఒక్కోసారి శత్రువులతో కలవాల్సి వస్తుంది. అదే రాజకీయం అంటే” అని పవన్ హాట్ కామెంట్స్ చేశారు.

 

తిరుపతిలో జనసేన జనవాణి..