AP High Court : ఏపీ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్డీలు
హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జీల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారుసు చేసింది. సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో బుధవారం(జులై 20,2022) జరిగిన కొలీజియంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఏడుగురు న్యాయాధికారులకు జడ్జిలుగా పదోన్నతి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

Ap High Court
AP High Court : ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు జడ్జీలు రానున్నారు. హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జీల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారుసు చేసింది. సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో బుధవారం(జులై 20,2022) జరిగిన కొలీజియంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఏడుగురు న్యాయాధికారులకు జడ్జిలుగా పదోన్నతి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఏపీ హైకోర్టు జడ్జీలుగా అడుసుమిల్లి వెంకట రవీంద్రబాబు, వక్కల గడ్డ రాధాకృష్ణ కృపాసాగర్, బండారు శ్యామ్‌సుందర్, ఊటుకూరు శ్రీనివాస్, బొప్పన వరాహలక్ష్మి నరసింహ, తల్లాప్రగడ మల్లిఖార్జునరావు, దుప్పల వెంకటరమణ పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారుసు చేసింది.