Threat Call : నెల్లూరు రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు కాల్
దీంతో అధికారులు, పోలీసులు రైల్వే స్టేషన్ లో అడుగడుగునా సోదాలు నిర్వహించారు. బాంబు, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు.

Nellore Railway Station
Threat Call To Nellore Railway Station : ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు రైల్వే స్టేషన్ లో బాంబు కలకలం రేగింది. రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్ పై బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ కాల్ చేశాడు. సంతపేట పోలీసులు, రైల్వే పోలీసులు, అధికారులు అప్రమత్తమయ్యారు.
విషయాన్ని ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు, పోలీసులు రైల్వే స్టేషన్ లో అడుగడుగునా సోదాలు నిర్వహించారు. బాంబు, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. బాంబు ఎక్కడా దొరక్కపోవడంతో ఫేక్ కాల్ గా తేల్చారు. ఇది ఆకతాయి పనిగా నిర్ధారించారు. బెదిరింపు కాల్ చేసిన ఆకతాయి ఫోన్ నెంబర్ ను పోలీసులు ట్రేస్ అవుట్ చేస్తున్నారు.
Threat Call : గన్నవరం విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్
బెదిరింపు కాల్ చేసిన గుర్తు తెలియని వ్యక్తికి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. అగంతకుడు నెల్లూరు జిల్లాకు చెందిన వెంగల్ రావుగా గుర్తించారు. సాంకేతికంగా అతను ఎక్కడి నుంచి కాల్ చేశాడు? ఎక్కడున్నాడు? అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. అతన్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు అన్నీ చర్యలు తీసుకుంటున్నారు.
మరోవైపు విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఎయిర్ పోర్టులో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ కాల్ చేశాడు. ఎయిర్ ఇండియా విమానానికి బెదిరింపు కాల్ వచ్చింది. ఓ అగంతకుడు ఈ బెదిరింపు కాల్ చేశారు. ఎయిర్ ఇండియా 320 విమానంలో బాంబు ఉందని కాల్ వచ్చింది.
దీంతో అప్రమత్తమైన ఎయిర్ పోర్టు అధికారులు రాత్రి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని నిలిపి వేశారు. దీంతో ఎయిర్ పోర్టు సిబ్బంది అప్రమత్తమైంది. ఎయిర్ పోర్టులో బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. ఎయిర్ పోర్టులోనికి పోలీసులు ఎవరినీ అనుమతించలేదు. ఎక్కడా బాంబు కనిపించకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.