ఇది మా మాట : మూడు రాజధానుల నిర్ణయాన్నిప్రజలు ఒప్పుకోవాల్సిందే : హోంమంత్రి

ఏపీకి మూడు రాజధానులు నిర్ణయాన్ని ప్రజలు అంగీకరించాల్సిందేనని హోమంత్రి సుచరిత అన్నారు. కీలక మార్పులు జరిగినప్పుడు కొంతమంది కష్టపడాల్సి వస్తుందనీ..కొన్ని నష్టాలు జరిగినా తప్పదనీ..మూడు రాజధానుల విషయంలో ప్రజలు ఇప్పుడు ఇబ్బందులు పడినా..నష్టపోయినా ఒప్పుకోక తప్పదని అన్నారు.
రాష్ట్రం విడిపోయినప్పుడు హైదరాబాద్ నుంచి కాళీ చేతులతో వచ్చామనీ..కానీ భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు..కష్టాలు రాకుండా ఉండాలంటే అభివృద్ది వికేంద్రీకరణ తప్పదని మంత్రి సుచరిత అన్నారు.
రాజధాని ఒకే ప్రాంతంలో ఉండే కంటూ మూడు ప్రాంతాలలో ఏర్పాటైతే అభివృద్ధి కూడా అలాగే ఉంటుందని..రాష్ట్రం సమగ్రంగా అభివృద్ది చెందాలనే మంచి ఉద్ధేశ్యంతో సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని మంత్రి తెలిపారు. వికేంద్రీకరణ సమయంలో కొంత నష్టం ఏర్పడతుందనీ అయినా తప్పదన్నారు.
సుఖం కోసం కష్టాన్ని భరించాలన్నారు. ప్రస్తుతం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా భవిష్యత్తులో మూడు ప్రాంతాలు అభివృద్ది చెందుతాయని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజలు కట్టుబడి ఉండాల్సిందేనని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రజలంతా ప్రాంతం గురించి కాదు రాష్ట్రం గురించి రాష్ట్ర అభివృద్ది కోసం ఆలోచించాలని మంత్రి సుచరిత సూచించారు.