ఒకే కుటుంబంలో ముగ్గురు బలవన్మరణం..

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలోని యర్రగుంటలో విషాదం నెలకొంది. ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు.

ఒకే కుటుంబంలో ముగ్గురు బలవన్మరణం..

Updated On : March 9, 2021 / 10:02 AM IST

Three committed suicide in the same family : అనంతపురం జిల్లాలో విషాదం నెలకొంది. ఆర్థిక సమస్యలు ఓ కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన గార్లదిన్నె మండలం యర్రగుంట గ్రామంలో చోటు చేసుకుంది. రామకృష్ణ, రాజేశ్వరి భార్యాభర్తలు..యర్రగుంటలో నివిసిస్తున్నారు. వీరికి దేవేంద్ర అనే 14 ఏళ్ల కుమారుడు ఉన్నాడు.

గత కొంతకాలంగా కుటుంబం ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో కొడుకుతో కలిసి భార్యాభర్తలు బలవన్మరణానికి పాల్పడ్డారు. విషపు గుళికలు మింగి రామకృష్ణ, అతని భార్య రాజేశ్వరి, కుమారుడు దేవేంద్ర బలవన్మరణం చేసుకున్నారు. కుటుంబ సమస్యలే బలవన్మరణానికి కారణంగా తెలుస్తోంది.

సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు బలవన్మరణం చేసుకోవడంతో స్థానికంగా కలకలం రేపుతోంది. కుటుంబం మొత్తం బలవన్మరణానికి పాల్పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.