Road accidents : నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కార్పియే కల్వర్టును ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృత్యువాత పడగా.. మరో ముగ్గురికి తీవ్రంగా గాయపడ్డారు..

Road accidents : నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Road Accdient

Updated On : April 18, 2022 / 7:07 AM IST

Road accidents : నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కార్పియే కల్వర్టును ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృత్యువాత పడగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం అర్థరాత్రి ఆళ్లగడ్డ మండలం గూబగుండం వద్ద హైవేపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మృతులంతా కడప జిల్లా మైదుకూరు వాసులుగా గుర్తించారు. మైదుకూరు పట్టణానికి చెందిన వెంకటేశ్వర్లు తన కుటుంబ సభ్యులతో కలిసి నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం పరిధిలోని మద్దిలేటి స్వామి క్షేత్రానికి వెళ్లి… దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం-ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు, అతడి భార్య లక్ష్మి దేవి, అక్క సామ్రాజ్యం అక్కడికక్కడే మృతి చెందారు. వాహనంలో ప్రయాణిస్తున్న డ్రైవర్ శ్రీనివాసులు, నాగమణి, మౌనిక తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.