Devaragattu : రణరంగంగా మారిన దేవరగట్టు కర్రల సమరం, ముగ్గురు మృతి, 100మందికి పైగా గాయాలు
ఎంతమంది పోలీసులు అప్రమత్తమై ఉన్నా జరిగాల్సిన ఘోరం జరిగింది. ముగ్గురిని బలితీసుకుంది. బన్ని ఉత్సవం పేరుతో జరిగిన ఈ కర్రల సమరంలో ప్రతీ ఏటా ఇటువంటి ఘటనలు కొనసాగుతునే ఉన్నాయి.

devaragattu Stick Fighting
devaragattu Stick Fighting : కర్నూలు జిల్లాలో దేవరగట్ట కర్రల సమరం ప్రారంభమైన కొద్దిసేపటికే పలువురిని బలి తీసుకుంది. ఈ కర్రల సమయంలో ముగ్గురు మృతి చెందారు. 100మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సమరం ప్రారంభమైన కొంతసేపటికే రణరంగాన్ని తలపించింది. 11 గ్రామాల ప్రజలు పాల్గొన్న ఈ కర్రల సమరంలో ముగ్గురు మృతి చెందగా 100మందికిపైగా తీవ్రంగా గాయాలపాలయ్యారు. వీరిలో ఎనిమిదిమంది అత్యంత తీవ్రంగా గాయపడటంతో అందరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఎంతమంది పోలీసులు అప్రమత్తమై ఉన్నా జరిగాల్సిన ఘోరం జరిగింది. ముగ్గురిని బలితీసుకుంది. బన్ని ఉత్సవం పేరుతో జరిగిన ఈ కర్రల సమరంలో ప్రతీ ఏటా ఇటువంటి ఘటనలు కొనసాగుతునే ఉన్నాయి. ఎంత మంది పోలీసులు ఉన్నా.. ఈ కర్రల సమరాన్ని ఆపలేకపోవటం, ప్రాణాలు కోల్పోవటం, గాయాలపాలు కావటం సర్వసాధారణంగా జరుగుతునే ఉంది. ఈ ఏడాది కూడా కర్రల సమయంలో రక్తం చిందింది.
ఈ కర్రల సమరం వీక్షించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రజలు చేరుకున్నారు. 2022 కంటే ఈ ఏడాది ఈ ఉత్సవానికి వివిధ ప్రాంతాల నుండి దేవరగట్టుకు ప్రజలు చేరుకున్నారు. జిల్లా పోలీసులు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసినా ముగ్గురు ప్రాణాలు పోయాయి.