Srikakulam Incident : శ్రీకాకుళంలో దారుణం.. తల్లీకూతుళ్లను సజీవ సమాధి చేసే యత్నం

శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాలు, కుటుంబకలహాలతో ఇద్దరు మహిళలపై మట్టిపోశారు ప్రత్యర్థులు. ఇద్దరు మహిళలపై ట్రాక్టర్ తో కంకర మట్టి వేశారు.

Srikakulam Incident : శ్రీకాకుళంలో దారుణం.. తల్లీకూతుళ్లను సజీవ సమాధి చేసే యత్నం

Updated On : November 7, 2022 / 10:30 PM IST

Srikakulam Incident : శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాలు, కుటుంబకలహాలతో తల్లీ కూతుళ్లైన ఇద్దరు మహిళలను వారి బంధువులు సజీవ సమాధి చేయబోయారు. ఇద్దరు మహిళలపై ట్రాక్టర్ తో కంకర మట్టి వేశారు. మహిళలు మట్టిలో కూరుకుపోయారు. ఇది గమనించిన స్థానికులు మట్టిని తొలగించి మహిళలను కాపాడారు.

కొన్నేళ్లుగా ఇంటి స్థలం కోసం కొట్ర దాలమ్మ, మజ్జి సావిత్రి పోరాటం చేస్తున్నారు. హరిపురం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు తమ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపించారు. కొట్ర రామారావు, ఆనందరావు, ప్రకాశ్ రావులు తమను వేధిస్తున్నారని వాపోయారు. అధికారులు తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

తమ స్థలాన్ని తమ బంధువులు అక్రమించుకున్నారని బాధిత మహిళల ఆరోపించింది. ఆక్రమణపై ప్రశ్నించినందుకే తమపై 3 ట్రాక్టర్లతో మట్టి కుమ్మరించి సజీవ సమాధి చేయబోయారని బాధితులు కన్నీటి పర్యంతం అయ్యారు. మహిళలు గట్టిగా కేకలు వేయడంతో గమనించిన స్థానికులు వారిని కాపాడారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.