ఎల్జీపాలిమర్స్ ఘటనలో ముగ్గురు అధికారులపై వేటు

  • Published By: bheemraj ,Published On : July 8, 2020 / 12:37 AM IST
ఎల్జీపాలిమర్స్ ఘటనలో ముగ్గురు అధికారులపై వేటు

Updated On : July 8, 2020 / 10:24 AM IST

ఎల్జీపాలిమర్స్ ఘటనలో ముగ్గురు అధికారులపై వేటు పడింది. హైపవర్ కమిటీ, కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకుంది. పర్యావరణ శాఖ రీజనల్ అధికారి ప్రసాద్ రావు, పీసీబీ జోనల్ అధికారి లక్ష్మీనారాయణతోపాటు ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్ స్పెక్టర్ ప్రసాద్ పై సస్పెన్షన్ వేటు పడింది. పర్యావరణ అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు.

కంపెనీలో స్టైరిన్ నిల్వలపై పర్యవేక్షణ చేయలేదని అధికారులపై చర్యలు చేపట్టారు. హైపవర్ కమిటీ నివేదిక ఆధారంగా విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటనపై పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారు. గ్యాస్ లీకేజీ ఘటనలో ఎల్జీ పాలిమర్స్ సీఈవో సునీక్ జియా, డైరెక్టర్ డీఎస్ కిమ్, అడిషనల్ డైరెక్టర్ మోహన్ రావుతోపాటు మొత్తం 11 మందిని అరెస్టు చేశారు. ఎల్జీ పాలిమర్స్ పై మే 7న పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసుకున్నారు.

గ్యాస్ లీకేజీ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, 585 మంది అస్వస్థతకు గురయ్యారు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై సోమవారం హైపవర్ కమిటీ నివేదిక సమర్పించింది. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని నివేదికలో పేర్కొంది. హైపవర్ కమిటీ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది.

Read Here>>కరోనా నేపథ్యంలో స్పెషల్ సబ్ జైళ్లు…ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం